DGP Venkataraman : చెన్నై : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ చీఫ్ విజయ్ (TVK Vijay) కరూర్ వేదికగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో చోటు చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాదం పలువురి కుటుంబాలలో కన్నీళ్లను నింపింది. అత్యంత విషాదకరమైన సంఘటనలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 39 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు చిన్నారులు ఉండగా 16 మంది మహిళలు మృతి చెందారు. 40 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. పలు ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు సీఎం ఎంకే స్టాలిన్. ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు. రిటైర్డ్ న్యాయమూర్తి అరుణ జగదీశన్ ను నియమించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
DGP Venkataraman Comments on Karur Incident
కరూర్ ఘటనపై స్పందించారు తమిళనాడు డీజీపీ వెంకట రామన్. ఆయన మీడియాతో మాట్లాడారు.
కరూర్ తొక్కిసలాట ఘటనకు పూర్తి బాధ్యత టీవీకే పార్టీ చీఫ్ విజయ్ అని పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం లేదన్నారు. 10 వేల మంది హాజరయ్యేందుకు పర్మిషన్ ఇచ్చామని, కానీ 27 వేల మందికి పైగా హాజరయ్యారని చెప్పారు డీజీపీ. మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సిన విజయ్ రాత్రి 7 గంటలకు వచ్చారని ఆరోపించారు. ఒక్కసారిగా జనం పెరగడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. తమను నిందించడం వల్ల ఎలాంటి ఫాయిదా లేదన్నారు. ఏర్పాట్లను చేయడంలో జిల్లా పార్టీ నాయకత్వం విఫలమైందని , దీనికి విజయ్ సమాధానం చెప్పాలని పేర్కొన్నారు వెంకట రామన్.
Also Read : CM MK Stalin Clear Orders : విజయ్ ర్యాలీ ఘటనపై విచారణకు ఆదేశం
