DGP Shivadhar Reddy Warning : డ్ర‌గ్స్ ప్ర‌మాదం అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం

తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి హెచ్చ‌రిక

Hello Telugu - DGP Shivadhar Reddy Warning

Hello Telugu - DGP Shivadhar Reddy Warning

DGP Shivadhar Reddy : హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి (DGP Shivadhar Reddy) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారి ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. స‌మాజానికి పెను స‌వాల్ గా మారింద‌ని వాపోయారు. దీనిని రూపు మాపేందుకు ప్ర‌తి ఒక్క‌రు క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. డ్ర‌గ్స్ ప‌ట్ల అవగాహ‌న పెంపొందించేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు. ఇందుకోసం స్వ‌చ్చంధ సంస్థ‌లు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. ఇది ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త అని పేర్కొన్నారు. చాలా కుటుంబాలు డ్ర‌గ్స్ బారిన ప‌డిన వారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని వాపోయారు డీజీపీ. ప్ర‌ధానంగా డ్ర‌గ్స్ కు చిన్నారులు, విద్యార్థులు, యువ‌త ఎక్కువ‌గా ప్ర‌భావితం అవుతున్నార‌ని, వీరిని వాటి నుంచి ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు శివ‌ధ‌ర్ రెడ్డి.

Telangana DGP Shivadhar Reddy Warning for Drugs

విద్యా సంస్థలు, పోలీసులు కలిసి యువతలో డ్రగ్స్‌ మత్తు వ్యసనాన్ని అరికట్టేందుకు చేయి కలపాలని ఆయన కోరారు. ఈ సందేశం ప్రతీ తల్లిదండ్రి, ఉపాధ్యాయుడు, విద్యార్థి, పౌరుడు విధిగా ఆలోచించాల‌ని సూచించారు . డ్రగ్స్‌ ముప్పు కేవలం ఒక వ్యక్తి సమస్య కానే కాద‌న్నారు. అది కుటుంబాలను, భవిష్యత్తును నాశనం చేసే విషం అని హెచ్చ‌రించారు. ఈ సమస్యను ఎదుర్కోవాలంటే విద్యాసంస్థలు, పోలీసు విభాగం, సమాజం మొత్తం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల వయస్సు దశలోనే అవగాహన కల్పించడం ద్వారా పెద్ద ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు డీజీపీ. డ్రగ్స్‌ దుష్ప్రభావాలపై చర్చలు, అవగాహన కార్యక్రమాలు, పాఠశాలల్లో క్రమమైన మానసిక ఆరోగ్య శిక్షణలు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

Also Read : Minister Narayana Important Update : పెట్టుబ‌డుల‌కు ఏపీ స్వ‌ర్గ‌ధామం : నారాయ‌ణ

Exit mobile version