Minister Narayana Important Update : పెట్టుబ‌డుల‌కు ఏపీ స్వ‌ర్గ‌ధామం : నారాయ‌ణ

దుబాయ్ లో పెట్టుబ‌డిదారుల‌తో కీల‌క భేటీ

Hello Telugu - Minister Narayana Important Update

Hello Telugu - Minister Narayana Important Update

Minister Narayana : దుబాయ్ : దుబాయ్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ (Minister Narayana). దేశంలోనే రైజింగ్ స్టేట్ గా ఏపీ ముందుకు వెళుతోంద‌న్నారు. ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని చెప్పారు. విస్తృతంగా పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. ఇప్ప‌టికే ప్ర‌పంచంలోని ఐటీ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న ఏఐ హ‌బ్ ను విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా ఏర్పాటు చేసింద‌ని చెప్పారు. హిందూజా గ్రూప్ రూ. 20 వేల కోట్ల‌తో త‌మ స‌ర్కార్ తో ఒప్పందం చేసుకుంద‌న్నారు. ఈనెల 14,15 వ తేదీల‌లో రెండు రోజుల పాటు విశాఖ వేదిక‌గా సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు 2025ను నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. ఇందులో భాగంగా 2,30,000 కోట్ల మేర‌కు ఒప్పందం చేసుకోవాల‌ని తాము ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని వెల్ల‌డించారు మంత్రి నారాయ‌ణ‌.

Minister Narayana Invites

ఇందులో భాగంగానే పారిశ్రామిక‌వేత్త‌ల‌ను , ఔత్సాహికుల‌ను , కంపెనీల‌ను తాము ఆహ్వానిస్తున్నామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన సీఈఓలు, చైర్మ‌న్లు, మేనేజింగ్ డైరెక్ట‌ర్లు, వ్యాపార‌వేత్త‌లు వ‌స్తున్నార‌ని, పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పాట్లు చేసింద‌ని వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా దుబాయ్ ప‌ర్య‌ట‌న‌ను పుర‌స్క‌రించుకుని మంత్రి నారాయ‌ణ బీఆ (BEEAH) ఫెసిలిటీ, టెక్టాన్ (tecton) ఇంజనీరింగ్, అరబ్ – ఇండియా స్పీసెస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. వేస్ట్ మేనేజ్మెంట్,రికవరీ ప్లాంట్ లు, వైద్య రంగం, విద్యుత్ ,ఆయిల్, గ్యాస్, వాటర్ ప్రాజెక్ట్స్ నిర్మాణంలో పేరు పొందిన ప‌రిశ్ర‌మ‌ల‌తో చ‌ర్చించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

Also Read : KTR Shocking Comments : జూబ్లీహిల్స్ లో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే : కేటీఆర్

Exit mobile version