కోల్ క‌తా ఘ‌ట‌న నేప‌థ్యంలో ‘మెస్సీ’కి భారీ భ‌ద్ర‌త

ప్ర‌క‌టించిన డీజీపీ శివ ధ‌ర్ రెడ్డి

hellotelugu-DGPTelangana

హైద‌రాబాద్ : మెస్సీ గోట్ టూర్ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివ ధ‌ర్ రెడ్డి. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మెస్సీ తొలుత ఉద‌యం 11.30 గంట‌ల‌కు త‌న స్నేహితుడితో క‌లిసి కోల్ క‌తాకు చేరుకున్నారు. కాగా స్టేడియంకు చేరుకున్న వెంట‌నే పెద్ద ఎత్తున దూసుకు వ‌చ్చారు ఫ్యాన్స్ త‌న‌ను చూసేందుకు. అయితే పెద్ద ఎత్తున డ‌బ్బులు వ‌సూలు చేశార‌ని, కానీ మెస్సీని చూసేందుకు త‌మ‌కు ఆస్కారం లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆపై నిర్వాహ‌కుల‌పై భ‌గ్గుమ‌న్నారు. స్టేడియంలో కుర్చీల‌ను విసిరి వేశారు. దీంతో పోలీసులు వారిపైకి లాఠీల‌ను ఝులిపించారు. దీంతో మైదానంలో తీవ్ర గంద‌ర‌గోళం చోటు చేసుకుంది.

ఈ త‌రుణంలో ఇవాళ కోల్ క‌తా నుంచి నేరుగా హైద‌రాబ‌ద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు త‌న ప్ర‌తినిధి బృందంతో క‌లిసి అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గ‌జం మెస్సీ. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి. కల్ కతా ఘటన నేపథ్యంలో మెస్సీ మ్యాచ్ కు భారీ భద్రత ఏర్పాటు చేశామ‌న్నారు. కోల్ కతాలో రోప్ పార్టీలు లేక పోవడంతో ఘటన జరిగినట్లు తెలుస్తోందని అన్నారు. అక్కడ జరిగిన లోపాలు తెలుసుకుని ఇక్కడ అప్రమత్తంగా ఉన్నామని స్ప‌ష్టం చేశారు డీజీపీ. రాత్రి.7.15కు మెస్సీ ఉప్పల్ స్టేడియానికి వస్తార‌ని చెప్పారు. కేవలం క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు, ఫుట్ బాల్ ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసింద‌ని వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మం మొత్తం గంటకు పైగా ఉంటుంద‌న్నారు శివ ధ‌ర్ రెడ్డి.

Exit mobile version