Harish Kumar : నంద్యాల జిల్లా : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16వ తేదీన నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. పీఎం టూర్ ను పురస్కరించుకుని మంగళవారం శ్రీశైలంలో చేస్తున్న భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా.
DGP Harish Kumar Vigilance
ఈ సందర్భంగా డిజిపి (Harish Kumar) ప్రధాని పర్యటించే ప్రదేశాలలో హెలిపాడ్, రోడ్డు మార్గం, భ్రమరాంబ గెస్ట్ హౌస్, శివాజీ స్ఫూర్తి కేంద్రం, గుడి పరిసర ప్రదేశాలు, సేఫ్ హౌస్ మొదలగు ప్రాంతాలలో పర్యటించారు. భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు నంద్యాల ఎస్పీని. ఎవరెవరు ఎలాంటి విధులు నిర్వహించాలనే దానిపై దిశా నిర్దేశం చేశారు డీజీపీ.
ఈ కార్యక్రమంలో డిజిపితో పాటు కర్నూలు రేంజి డిఐజి కోయ ప్రవీణ్ ,ఈగల్ టీం ఐజీ ఆకే. రవికృష్ణ , నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ , శ్రీ అదిరాజ్ సింగ్ రాణా, ఏఎస్పీ ఎం.జావళి , ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్ , తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శ్రీశైలంలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా కర్నూలుకు బయలుదేరి వెళతారు. అక్కడ కూటమి సర్కార్ ఆధ్వర్యంలో నిర్వహించే సూపర్ జీఎస్టీ సూపర్ సక్సెస్ పేరుతో నిర్వహించే సభలో పాల్గొంటారు.
Also Read : YS Sharmila Fired on AP Govt : విద్యుత్ ఉద్యోగుల ఆందోళనపై వివక్ష తగదు
