DGCA Fired on Air India : ఎయిర్ ఇండియా వైఫ‌ల్యం డీజీసీఏ ఆగ్ర‌హం

వ‌రుస ఘ‌ట‌న‌ల‌పై సీరియ‌స్ కామెంట్స్

Hello Telugu - DGCA Fired on Air India

Hello Telugu - DGCA Fired on Air India

Air India : ప్ర‌సిద్ద టాటా గ్రూప్ కు చెందిన ఎయిర్ ఇండియా నిర్వ‌హ‌ణ‌లో చోటు చేసుకుంటున్న వ‌రుస వైఫ‌ల్యాలు తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. ఈ సంద‌ర్భంగా డీజీసీఏ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. అందిన నివేదిక ఆధారంగా ప‌నితీరు మార్చుకోవాల‌ని హెచ్చ‌రించింది. లేక‌పోతే తీవ్ర చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంద‌ని పేర్కొంది. విమానం అత్యవసర స్లయిడ్ తనిఖీలో ఎయిర్ ఇండియా వైఫల్యంపై డీజీసీఏ తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేసింది. ఇదిలా ఉండ‌గా ఒక విమానంలో అత్యవసర స్లయిడ్ తనిఖీ ఆలస్యంగా జరిగిందని ఆడిట్‌లో వెల్లడి కావ‌డం ప‌ట్ల‌ పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఎయిర్ ఇండియాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యను ప్రారంభించిన‌ట్లు స‌మాచారం.

DGCA Slams Air India

సరిదిద్దే వరకు డీజీసీఏ వెంటనే విమానాన్ని నిలిపి వేసింది. డీజీసీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్ పాలసీ అండ్ ప్రొసీజర్ మాన్యువల్ ప్రకారం ఎయిర్ ఇండియా బాధ్యతాయుతమైన సిబ్బందిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యను ప్రారంభించిందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.

జూన్‌లో విమానం AI 171 కూలిపోవడానికి ముందు వారాలలో ఎయిర్ ఇండియా నడుపుతున్న విమానాలను తప్పనిసరి భద్రతా నిబంధనలను ఉల్లంఘించింద‌ని, గడువు ముగిసిన అత్యవసర స్లయిడ్ తనిఖీలతో ఎగరడానికి అనుమతించారని ప్రభుత్వానికి తెలుసా అని డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి ఈ సమాధానం ఇచ్చారు.

విమానయాన సంస్థలు, వాటి సిబ్బందిపై నిఘా, ఆకస్మిక తనిఖీలు, రాత్రి నిఘా నిర్వహించడం ద్వారా విమానయాన సంస్థలు అన్ని భద్రత, నిర్వహణ ప్రమాణాలను పాటిస్తున్నాయని DGCA నిర్ధారిస్తుందని మంత్రి అన్నారు.

Also Read : Minister Rajnath Singh Shocking Comments : ఆప‌రేష‌న్ సిందూర్ ఆగ‌దు – రాజ్ నాథ్ సింగ్

Exit mobile version