KTR Interesting Comments KCR : కేసీఆర్ లాగా పాలించిన నేత దేశంలో లేరు

స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్

Hello Telugu - KTR Interesting Comments KCR

Hello Telugu - KTR Interesting Comments KCR

KTR : హైద‌రాబాద్ – 79 ఏండ్ల స్వతంత్ర భారతంలో కేసీఆర్ లాగా పాలించిన నాయకుడు ఒక్కరు కూడా లేరన్నారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). కాంగ్రెస్, టీడీపీ పాలనలో పడావుబడ్డ తెలంగాణను పదేండ్లలోనే అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా మార్చిన ఘ‌న‌త త‌న‌కే ద‌క్కుతుంద‌న్నారు. లక్ష్య సాధన నుంచి పక్కకు జరిగితే రాళ్లతో కొట్టి చంపండన్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ పేరు ఎత్తడమే పాపమైన రోజుల్లో పార్టీ పెట్టడం దుస్సాహసమేన‌ని అన్నారు. రాష్ట్రాన్ని సాధించిన నాయ‌కుడిగా చిర‌స్థాయిగా నిలిచి పోతార‌న్నారు. శుక్ర‌వారం కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ స‌మావేశంలో ప్ర‌సంగించారు.

KTR Parises KCR Ruling

తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారన్న రేవంత్ అండ్ కోకు చెంప దెబ్బ లాంటి సమాధానం కేంద్రం ఇచ్చిందన్నారు . పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పును కేవలం 20 నెలల్లోనే రేవంత్ రెడ్డి చేశాడ‌ని ఆరోపించారు. మహేంద్ర తోటకూరి రాసిన ప్రజా యోధుడు పుస్తకాన్ని ఆవిష్క‌రించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించే సన్నాసులకు 25 ఏండ్ల క్రితం ఈ గడ్డపై ఉన్న నిర్భంద పరిస్థితులు ఏ మాత్రం తెలియవన్నారు కేటీఆర్. తెలంగాణకు బద్ద వ్యతిరేకి అయిన చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతుంటే రాజకీయ పార్టీ పెట్టాలని ఆలోచించడమే దుస్సాహసం అన్నారు.

శూన్యం నుంచి సునామీని సృష్టించినట్టుగా తెలంగాణ రానే రాదన్న అనుమానాలను పటాపంచలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కారణ జన్ముడు కేసీఆర్ అని కొనియాడారు కేటీఆర్. తల్లికి జన్మనిచ్చిన తనయుడు అని కేసీఆర్ ను ప్రజాకవి గోరటి వెంకన్న ప్రశంసించడం ఏమాత్రం అతిశయోక్తి కాద‌న్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ పుస్తకావిష్కరణ జరగడం సముచితం, తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా కేసీఆర్‌‌కి ఇది గొప్ప కానుక అన్నారు. కేసీఆర్ అప్పులు చేశారని రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు చేస్తున్న తప్పుడు ప్రచారానికి చెంపదెబ్బ లాంటి సమాధానాన్ని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు.

Also Read : Donald Trump Shocking Comments : భార‌త్, పాకిస్తాన్ ల మ‌ధ్య యుద్దాన్ని ఆపాను

Exit mobile version