Deputy CM Pawan Interesting Comments : జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు దేశానికి నిజ‌మైన దీపావ‌ళి

స్ప‌ష్టం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

Hello Telugu - Deputy CM Pawan Interesting Comments

Hello Telugu - Deputy CM Pawan Interesting Comments

Deputy CM Pawan : అమ‌రావ‌తి : కేంద్ర స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అధ్యక్షత‌న జీఎస్టీ కౌన్సిల్ కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా స్లాబ్ రేట్స్ ను కూడా త‌గ్గించింది. గ‌తంలో నాలుగు స్లాబ్ రేట్స్ ఉండేవి. వీటిపై దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌, ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. చివ‌ర‌కు గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితిలో స్లాబ్ రేట్స్ ను రెండింటిగా విభ‌జించింది. ఒక‌టి 5 శాతం కింద‌కు వ‌స్తు సేవ‌ల‌ను కేటాయించ‌గా మ‌రోటి 18 శాతానికి కేటాయించింది. ఈ సంద‌ర్భంగా మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబ‌రం స్పందించారు. సంస్క‌ర‌ణ‌లు ఇప్పుడు తీసుకు రావ‌డం కంటే గ‌త ఎనిమిది సంవ‌త్స‌రాల కింద‌టే తీసుకు వ‌చ్చి ఉంటే బావుండేద‌న్నారు.

Deputy CM Pawan Kalyan key Comments on GST Reforms

ఈ సంద‌ర్భంగా ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Deputy CM Pawan) స్పందించారు. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన వస్తువులు, సేవల పన్ను సంస్కరణలను స్వాగతించారు. ఈ అద్బుతమైన‌, సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం
దేశానికి నిజమైన దీపావళి బహుమతిగా అభివర్ణించారు. స్వాతంత్ర‌ దినోత్సవం ఎర్రకోట నుండి ఇచ్చిన హామీని నెరవేర్చార‌ని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జీఎస్టీ భారాన్ని తగ్గించడం ద్వారా తదుపరి తరం సంస్కరణలను ముందుకు తీసుకువచ్చిందని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పేర్కొన్నారు.

ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి, రైతులు, ఆరోగ్య సంరక్షణకు విస్తరించిన గణనీయమైన ఉపశమనంతో పాటు జీవితాలను కాపాడే, భవిష్యత్తును శక్తివంతం చేసే విద్య, బీమాపై జీఎస్టీని పూర్తిగా తొలగించడాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు.

Also Read : Popular Actor Nagarjuna – Nampally Court : నాంప‌ల్లి కోర్టుకు నాగార్జున ఫ్యామిలీ

Exit mobile version