Nagarjuna : హైదరాబాద్ – మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు ప్రముఖ నటుడు నాగార్జున, అమల, నాగ చైతన్య. నటి సమంతను ఇబ్బందులకు గురి చేశారని, తనను విడాకులు ఇచ్చేలా మోసం చేశారని ఆరోపించారు మంత్రి. ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. రాజకీయ, సినీ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసేలా చేశాయి. నటులు నాగార్జున, నాగ చైతన్య, సమంతలపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాగార్జున (Nagarjuna) , కుమారుడు నాగ చైతన్య తమ వాంగ్మూలాలను నమోదు చేయడానికి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.
Actor Nagarjuna Family Visit Nampally Court
కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై నాగార్జున సీరియస్ గా స్పందించారు. తమ పరువుకు భంగం వాటిల్లిందని వాపోయారు. తనపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు కోర్టులో. ఈ కేసు కు సంబంధించి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉన్న మహిళా నాయకురాలు ఇలాగేనా కామెంట్స్ చేసేది అంటూ మండిపడింది. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికింది. ఈ సందర్బంగా కేసును విచారించింది. తమ వాంగ్మూలాలను నమోదు చేసేందుకు కోర్టుకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి తాను హాజరయ్యానని చెప్పారు. ఈ విషయంలో ప్రస్తుతం విచారణ జరుగుతోందని ఆయన అన్నారు.
మాజీ మంత్రి కేటీ రామారావు మాదకద్రవ్యాల సంబంధిత కార్యకలాపాలకు పాల్పడ్డాడని, చైతన్య, సమంత విడాకులకు కూడా ఆయనతో సంబంధం ఉందని ఆరోపించారు. అక్కినేని కుటుంబం గురించి కూడా ఆమె అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. కెటిఆర్ ప్రభావం కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని అనేక మంది మహిళా నటుల కెరీర్లు నిలిచి పోయాయని ఆరోపించారు. కాగా సురేఖపై నాగార్జున రూ. 100 కోట్ల పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
Also Read : GST Reforms-Stock Market Growth : జీఎస్టీ సంస్కరణలతో స్టాక్ మార్కెట్ జోరు
