చిన్న‌స్వామి క్రికెట్ మ్యాచ్ ల‌కు గ్రీన్ సిగ్న‌ల్

ప్ర‌క‌టించిన డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్

hellotellugu-DkShivaKumar

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌స్తుతం అనుమ‌తి ఇవ్వ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇటీవ‌ల ఐపీఎల్ విజేత‌గా నిలిచింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు. ఈ సంద‌ర్బంగా స‌న్మానించాల‌ని నిర్ణ‌యించింది స‌ర్కార్. క్రికెట‌ర్ల‌ను చూసేందుకు భారీ ఎత్తున చిన్న స్వామి స్టేడియంకు త‌ర‌లి వ‌చ్చారు. ఈ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. ఆర్సీబీ జ‌ట్టుపై కేసులు కూడా నమోద‌య్యాయి. స‌ర్కార్ విచార‌ణ‌కు ఆదేశించింది స‌ర్కార్. స్టేడియంలో తాత్కాలికంగా మ్యాచ్ లు, కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌కుండా అభ్యంత‌రం తెలిపింది.

ఇదిలా ఉండ‌గా భార‌త మాజీ క్రికెట‌ర్ అనిల్ కుంబ్లే ఇటీవ‌లే సీఎం సిద్ద‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ ల‌ను క‌లిశారు. చిన్న స్వామి స్టేడియంలో మ్యాచ్ లు జ‌రిగేలా అనుమ‌తి ఇవ్వాల‌ని కోరారు. ఇదే స‌మ‌యంలో క‌ర్ణాట‌క క్రికెట్ అసోసియేష‌న్ మ్యాచ్ లు నిర్వ‌హించేందుకు ప‌ర్మిష‌న్ ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి విన్న‌వించింది. ఈ మేర‌కు ప‌రిశీలించిన స‌ర్కార్ నిర్వ‌హించేందుకు గాను అనుమ‌తి ఇచ్చిన‌ట్లు స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. విచార‌ణ చేప‌ట్టిన క‌మిటీ ప‌లు సూచ‌న‌లు చేసింద‌న్నారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగానే తాము ప‌ర్మిష‌న్ ఇచ్చేందుకు ఒప్పుకున్న‌ట్లు చెప్పారు . ’కున్హా ప్యానెల్ క‌మిటీ భద్రతా నిబంధనలను పాటించాలని సూచించిన‌ట్లు తెలిపారు .చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లను అనుమతించడం ద్వారా బెంగళూరు ప్రతిష్టను కాపాడటానికి తన ప్రభుత్వం చర్య తీసుకుందన్నారు.

Exit mobile version