PM Modi : సింగపూర్ – ప్రస్తుతం భారత దేశానికి ప్రజలే ఆస్తి. గతంతో పోల్చుకుంటే ప్రపంచ వ్యాప్తంగా భారత దేశానికి గౌరవం పెరిగిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సమయంలో దేశానికి సరైన నాయకుడుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారు. దేశంలో చాలా మంది ప్రధానులు..చాలా మంది సీనియర్ లీడర్లను చూశాను. రైట్ టైమ్, రైట్ ప్లేస్, రైట్ లీడర్ నరేంద్ర మోదీ. మోదీ (PM Modi) మనకు పెద్ద వరం అన్నారు.
CM Chandrababu Praises PM Modi
అమెరికాకు చెందిన ఓ సంస్థ చేసిన సర్వేలో మోదీ ప్రపంచంలోనే పాపులర్ లీడరుగా నెంబర్-1 స్థానంలో నిలిచారు. ప్రధానికి 75 శాతం అప్రూవల్ రేటింగ్ ఉంది. దేశానికి గుర్తింపు, సుస్థిరత మోదీ వల్లే వచ్చిందన్నారు. ఇలాంటి సమయంలో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లాలి. నరేంద్ర మోదీ వికసిత్ భారత్ నినాదంతో వెళ్తున్నారు. నేను స్వర్ణాంధ్ర సంకల్పంతో ముందుకెళ్తున్నాను అని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న సింగపూర్ భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే మాట్లాడుతూ.. తెలుగు డయాస్పొరా కార్యక్రమం చూస్తోంటే.. చంద్రబాబు రాక కోసం సింగపూర్ లోని తెలుగు ప్రజలు చాలా కాలంగా వేచి చూస్తున్నట్టుందని అన్నారు.
వివిధ రంగాల్లోని పెట్టుబడులకు ఏపీ స్వర్గధామంగా ఉంటుందని చెప్పారు. భారత దేశ, ఏపీ టూరిజం అభివృద్ధికి సింగపూరులో సెటిల్ అయిన తెలుగు వాళ్లు పని చేయాలని సూచించారు. ఆద్యంతం సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్, ఎన్నార్టీ ఛైర్మన్ వేమూరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : Raj Thackeray Interesting Meet : 13 ఏళ్ల తర్వాత మాతోశ్రీని సందర్శించిన రాజ్ ఠాక్రే
