Delhi CM in Bathukamma Interesting : బ‌తుక‌మ్మ వేడుక‌ల్లో ఢిల్లీ సీఎం

తెలంగాణ సంస్కృతికి ప్ర‌తీక

Hello Telugu - Delhi CM in Bathukamma Interesting

Hello Telugu - Delhi CM in Bathukamma Interesting

Delhi CM : న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో బ‌తుక‌మ్మ ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌డం ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకునేలా చేసింది. తాజాగా ఢిల్లీ రాష్ట్ర భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ముఖ్య‌మంత్రి రేఖా గుప్తా (Delhi CM) బ‌తుక‌మ్మ ఉత్స‌వాల సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్రమంలో పాల్గొన్నారు. ఆమె బ‌తుక‌మ్మ‌ను ఎత్తుకుని పూజించారు. మ‌హిళ‌ల‌తో క‌లిసి ఆడి పాడారు. త‌న జీవితంలో మ‌రిచి పోలేని ఆనందాన్ని, సంతోషానికి లోనైన‌ట్లు చెప్పారు ఈ సంద‌ర్బంగా సీఎం రేఖా గుప్తా. ఇదిలా ఉండగా బ‌తుక‌మ్మ ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించింది ఢిల్లీలోని రాంజాస్ కాలేజీకి చెందిన తెలుగు విద్యార్థి సంఘం. స‌ద‌రు నిర్వాహ‌కుల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు రాష్ట్ర ముఖ్య‌మంత్రి. ఈ పండుగ కేవలం పువ్వుల వేడుక మాత్రమే కాదని అన్నారు.

Delhi CM Rekha Gupta in Bathukamma Celebrations

మాతృత్వం, జీవితం, ప్రకృతి లయకు చిహ్నం అని, ఇది సృష్టి కరుణ, జీవిత శక్తిని ప్రతిబింబిస్తుంద‌ని పేర్కొన్నారు రేఖా గుప్తా. ఢిల్లీలో స్థిరపడిన తెలుగు సమాజం ఈ నగరాన్ని తమ కృషి, ప్రతిభతో అలంకరించడం ప‌ట్ల, దాని సంస్కృతికి కొత్త రంగులు కూడా జోడించిందన్నారు. ఇక్కడ ఉన్న విద్యార్థులు తెలుగు సంస్కృతి గర్వాన్ని పెంచడమే కాకుండా, భారతదేశ యువత బలం, శక్తిని కూడా సూచిస్తున్నాయ‌ని పేర్కొన్నారు సీం. మీ ఉత్సాహం, భాగస్వామ్యం అందరికీ స్ఫూర్తి దాయకంగా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేద‌న్నారు రేఖా గుప్తా. ఈ పవిత్ర పండుగ‌ సందర్భంగా, మనమందరం మన సంస్కృతి, సంప్రదాయాలను రక్షించు కోవడానికి, వాటిని భవిష్యత్ తరాలకు అందించడానికి ప్రతిజ్ఞ చేద్దామ‌ని పిలుపునిచ్చారు.

Also Read : Telangana Panchayat Elections Sensational Update : పంచాయ‌తీ ఎన్నిక‌లకు వేళాయెరా

Exit mobile version