Telangana Govt Breakthrough : కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఫిక్స్

ప్ర‌క‌టించిన తెలంగాణ కాంగ్రెస్ స‌ర్కార్

Hello Telugu - Telangana Govt Breakthrough

Hello Telugu - Telangana Govt Breakthrough

Telangana : హైద‌రాబాద్ – తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టికే ఇచ్చిన మాట మేర‌కు కొత్త‌గా రేష‌న్ కార్డుల జారీకి శ్రీ‌కారం చుట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ విషయాన్ని స్వ‌యంగా ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ధ్రువీక‌రించారు కూడా. ఈనెల 14న తుంగతుర్తిలో సీఎం రేవంత్ చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతుంద‌ని తెలిపింది స‌ర్కార్. గత 6 నెలల్లో 41 లక్షల మందికి కొత్తగా రేషన్ పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం కొలువు తీరాక మొత్తం 3 కోట్ల 14 లక్షల మందికి లబ్ధి చేకూరింద‌న్నారు.

Telangana Govt – New Ration Cards Update

పేద‌ల‌కు మేలు చేయాల‌న్న సత్ సంక‌ల్పంతోనే అస‌లైన పేద‌లు ఎవ‌రో స‌ర్వే ఆధారంగా రేష‌న్ కార్డుదారుల‌ను ఎంపిక చేశామ‌న్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలను అన్నింటిని అమ‌లు చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నామ‌ని అన్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ‌లో 42 శాతం బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. దీన్ని చ‌ట్టంగా త‌యారు చేస్తామ‌న్నారు. తాము చేప‌ట్టిన కుల గ‌ణ‌న స‌ర్వే దేశానికే ఆద‌ర్శంగా మారింద‌న్నారు.

ఆగ‌స్టు నెల లోపే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ఎ . రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే హైకోర్టు సీరియ‌స్ గా వార్నింగ్ ఇవ్వ‌డంతో స‌ర్కార్ దిగి వ‌చ్చింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు శ్రీ‌కారం చుట్టింది. కాగా బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి చ‌ట్టం తీసుకు వ‌స్తామ‌ని అన్నారు. కానీ అది వ‌ర్క‌వుట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం లేదు.

Also Read : MLA Raja Singh Resignation Shocking : ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా ఆమోదం – బీజేపీ

Exit mobile version