MLA Raja Singh : న్యూఢిల్లీ – బీజేపీ హై కమాండ్ సంచలన ప్రకటన చేసింది. హైదరాబాద్ లోని గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు కోలుకోలేని రీతిలో ఝలక్ ఇచ్చింది. ఇటీవలే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. బహిరంగంగానే ప్రకటించారు. తాను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కావాలని అనుకున్నారు. ఇదే పదవి రేసులో పలువురు ఎంపీలు సైతం పోటీ పడ్డారు. చివరకు ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వారిలో ఎంపీలు ఈటెల రాజేందర్ వర్సెస్ రాజాసింగ్ (MLA Raja Singh) . కానీ అనూహ్యంగా తెరపైకి కొత్త పేరు తీసుకు వచ్చింది బీజేపీ అధిష్టానం. మాజీ ఎమ్మెల్యే రామచంద్రరావు కు అధ్యక్షుడిగా ఛాన్స్ ఇచ్చింది.
MLA Raja Singh Resignation Accepted
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజా సింగ్. పార్టీపై, పెద్దలపై సంచలన ఆరోపణలు చేశారు. తాను హిందూ కట్టర్ నని, మొదటి నుంచి హిందువుగానే ఉన్నానని , దేశం కోసం ధర్మం కోసం పోరాడానని గుర్తు చేశారు. మీకో దండం మీ పార్టీకో దండం అంటూ మండిపడ్డారు రాజా సింగ్. అయినా బీజేపీ పట్టించుకోలేదు. చివరకు తన పదవికి స్వచ్చంధంగా రాజీనామా చేస్తున్నానని తెలిపాడు.
తన వల్ల పార్టీకి ఒరిగేది ఏమీ ఉండదని భావించింది బీజేపీ. ఈ మేరకు ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఓ లేఖ ద్వారా రాజా సింగ్ కు తను చేసిన రాజీనామాకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. తను పేర్కొన్న కారణాలు పార్టీ సిద్దాంతాలకు, పని తీరుకు విరుద్దంగా ఉందన్నారు. ఆయన లేవదీసిన అంశాలు అసంబద్దంగా ఉన్నాయన్నారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సిఫార్సు ఆధారంగా పార్టీ రాజీనామాను ఆమోదించాలని నిర్ణయించిందన్నారు.
Also Read : Telangana Govt Interesting : తెలంగాణలో 3 రోజులు పాఠశాలలకు సెలవులు
