Dead Butt Syndrome : నేటి ఆధునిక జీవనశైలి, మానవుల శారీరక శ్రమను మరింతగా తగ్గించింది. అనేక మంది ఉద్యోగులు రోజంతా డెస్క్ వర్క్‌లో గంటల తరబడి కూర్చొని పనిచేస్తూ అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలతో పాటు తాజాగా “డెడ్ బట్ సిండ్రోమ్” (Dead Butt Syndrome) అనే ఓ అరుదైన సమస్య కూడా తీవ్రమవుతోంది. ఈ సమస్య గురించి ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Dead Butt Syndrome – ‘డెడ్ బట్ సిండ్రోమ్’ అంటే ఏమిటి?
చాలా సమయం కూర్చుని గడపడం వల్ల తుంటి కండరాలు బలహీనమవుతాయి. వీటి పని తక్కువవడం వల్ల శరీర సమతుల్యతపై ప్రభావం పడుతుంది. దీన్నే వైద్యపరంగా ‘డెడ్ బట్ సిండ్రోమ్’ (Dead Butt Syndrome) అని అంటారు. ఇది కేవలం తుంటికి సంబంధించిన సమస్యగా కాకుండా వెన్నెముక, మోకాళ్లు, నడకపైన కూడా ప్రతికూలంగా పనిచేస్తుంది.
లక్షణాలు ఎలా ఉంటాయి?
- తుంటిలో తిమ్మిరి, అసహజ నొప్పి
- నొప్పి కాళ్ళకు లేదా వెన్నుకి వ్యాపించటం
- మోకాళ్లు, పాదాలలో నొప్పి
- నడకలో మార్పులు, శరీర అసమతుల్యత
- కూర్చున్న తర్వాత తలెత్తే నొప్పి
ఎవరికీ ఎక్కువ ప్రమాదం?
- ఒకే స్థితిలో గంటల తరబడి కూర్చునే ఉద్యోగులు
- డ్యాన్స్, స్పోర్ట్స్‌లో గాయపడ్డవారు
- సరైన వార్మప్ లేకుండా వ్యాయామం ప్రారంభించేవారు
ఎలా నివారించుకోవాలి?
వైద్యులు సూచించే కొన్ని కీలక సూచనలు ఇవే:
- ప్రతి 30–45 నిమిషాలకు ఒక్కసారి లేచి నడవాలి, శరీరాన్ని సాగదీయాలి
- లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోవాలి
- మధ్యమధ్యలో చిన్న బ్రేక్‌లు తీసుకొని వాకింగ్, జాగింగ్ చేయాలి
- పాదాల దిగువ భాగంలో చిన్న మద్దతు పెట్టుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది
- తుంటి కండరాల బలాన్ని పెంచే స్క్వాట్స్, హామ్‌స్ట్రింగ్, లెగ్‌లిఫ్ట్‌లు చేయాలి
- ఈత, డ్యాన్స్, క్రీడలతో కండరాలు చురుకుగా ఉంటాయి
- శరీరానికి తగినన్ని మినరల్స్ కోసం నీటిని ఎక్కువగా తీసుకోవాలి
- తలెత్తిన వాపులకు ఐస్ ప్యాక్ ఉపయోగించాలి
డెడ్ బట్ సిండ్రోమ్ సాధారణంగా చిన్న సమస్యగా కనిపించినా దీర్ఘకాలికంగా చూస్తే అది శరీరంలో అనేక అవయవాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కూర్చునే ఉద్యోగాలు చేస్తున్నవారు స్మార్ట్ బ్రేక్‌లతో పాటు చురుకైన జీవనశైలిని అలవర్చుకుంటే ఈ సమస్యను సమర్థంగా నివారించవచ్చని నిపుణులు అంటున్నారు.
Also Read : Dragon Fruit Proven : రోజూ ఒక డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇన్ని లాభాలా?



















