సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి దర్శనం

సూర్యమండల మధ్యవర్తిగా భక్తులకు అభయప్రదానం

hellotelugu-SuryaprabhaVahanam

తిరుమ‌ల : తిరుమ‌ల‌లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఏడో రోజైన ఆదివారం ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి వారు భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహన సేవలో సూర్య మండల మధ్యవర్తిగా వెలుగొందుతున్న స్వామి వారిని దర్శించుకుని భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి పోయారు. సూర్య భగవానుడు సకల జీవరాశులకు చైతన్యాన్ని, ప్రకృతికి వెలుగును, జీవకోటికి శక్తిని ప్రసాదించే ఆరోగ్య ప్రదాతగా పూజలు అందుకుంటున్నాడు. సూర్య తేజంతోనే చంద్రుడు సైతం ప్రకాశిస్తున్నాడని పురాణాలు పేర్కొంటాయి.

సూర్యప్రభ వాహనంపై స్వామివా రిని దర్శించు కోవడం వల్ల ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి వారు తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, జానకీ దేవి, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ సంద‌ర్బంగా నిర్వ‌హించిన గ‌రుడ సేవ‌కు ల‌క్ష‌కు పైగా భ‌క్తులు ద‌ర్శించుకున్నారు.

Exit mobile version