సంజు శాంస‌న్ రాకతో సీఎస్కే మ‌రింత బ‌లోపేతం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్

hellotelugu-SanjuSamson

ముంబై : భార‌త మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాడు కేర‌ళ క్రికెట్ స్టార్ సంజు శాంస‌న్. ఇండియా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచు కోవ‌డంలో ముఖ్య‌మైన పాత్ర పోషించాడు. త‌ను ఒక్క‌డే 5 ఇన్నింగ్స్ లు మాత్ర‌మే ఆడి 321 ర‌న్స్ చేశాడు. అంతే కాకుండా ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ అవార్డుకు ఎంపిక‌య్యాడు. ఒకానొక ద‌శ‌లో త‌ను టోర్నీ మొద‌ట్లో ఆడ‌లేక పోయాడు. చివ‌ర‌కు అభిషేక్ శ‌ర్మ‌కు అనారోగ్యం ఏర్ప‌డ‌డంతో గ‌త్యంత‌రం లేక భార‌త జ‌ట్టు మేనేజ్మెంట్ సంజు శాంస‌న్ కు ఛాన్స్ ఇచ్చారు.

ఈ క్ర‌మంలో త‌ను చావో రేవో తేల్చుకునేందుకు సిద్దం అయ్యాడు. త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు నేష‌న‌ల్ హీరోగా మారాడు సంజు శాంన్. ఇదే క్ర‌మంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు ఎన్నో ఏళ్లుగా ప్రాతినిధ్యం వ‌హించిన త‌ను ఇప్పుడు ధోనీ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు బ‌దిలీ అయ్యాడు. ఇరు జ‌ట్ల యాజ‌మాన్యాలు ప‌ర‌స్ప‌రం ఆట‌గాళ్ల‌ను మార్చుకున్నాయి. ఇప్పుడు అంద‌రి క‌ళ్లు సంజు శాంస‌న్ పైనే ఉన్నాయి. తాజాగా సీఎస్కే జెర్సీ ధ‌రించాడు సంజు శాంస‌న్. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

సీఎస్కే త‌న రాక‌తో మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని అన్నాడు ప‌ఠాన్. త‌న‌తో పాటు వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో టాప్ లో కొన‌సాగిన ఆట‌గాడైన శివ‌మ్ దూబే కూడా ఇదే జ‌ట్టు త‌ర‌పున ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ లో పాల్గొన‌నున్నాడు. ఈ ఇద్ద‌రు చేర‌డంతో సీఎస్కే జ‌ట్టు సూప‌ర్ కానుంద‌ని చెప్పాడు జ‌ట్టు సీఈఓ విశ్వ‌నాథ‌న్

Exit mobile version