ధర్మశాల : ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 210 రన్స్ చేసింది. అనంతరం మైదానంలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా కొన్ని బంతులు మిగిలి ఉండగానే పని పూర్తి చేసింది. 216 రన్స్ తో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి ఈ గెలుపుతో. ఇక మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు శ్రేయస్ అయ్యర్. పేసర్లను ఉపయోగించాడు కెప్టెన్. కానీ అనుభవం కలిగిన స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ను వాడుకోక పోవడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై కీలక వ్యాఖ్యలు చేశాడు అయ్యర్. పిచ్ పూర్తిగా పేసర్స్ కు అనుకూలిస్తోందని, అందుకే చాహల్ కు బౌలింగ్ చేసేందుకు చాన్స్ ఇవ్వలేదని చెప్పాడు. దీనిని రాద్దాంతం చేయడం తగదని పేర్కొన్నాడు.
మైదానం బయట ఉన్న వాళ్లకు ఏదో జరుగుతుదని అనుకుంటారని, వాళ్లు తమకు తోచినట్లుగా ఆలోచిస్తారని కానీ గ్రౌండ్ లో పిచ్ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని ఆ మేరకు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశాడు శ్రేయస్ అయ్యర్. అన్ని కోట్లు పెట్టి చాహల్ ను ఎందుకు తీసుకుంటామని ప్రశ్నించాడు. జట్టులో ప్రతి ఒక్కరినీ ఏదో రకంగా ఉపయోగించు కుంటామని చెప్పాడు. కొందరు చేస్తున్న విమర్శలను తాను పట్టించుకోనని పేర్కొన్నాడు. తమకు గెలుపు ఓటములు సమానమేనని అన్నాడు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కెప్టెన్.
