IBomma Founder-CP VC Sajjanar Shocking Comments : హై-ఎండ్ టెక్నాలజీని వాడిన ఐబొమ్మ ఫౌండ‌ర్

కీల‌క విష‌యాలు వెల్ల‌డించిన సీపీ వీసీ స‌జ్జ‌నార్

Hello Telugu - IBomma Founder-CP VC Sajjanar Shocking Comments

Hello Telugu - IBomma Founder-CP VC Sajjanar Shocking Comments

CP VC Sajjanar : హైద‌రాబాద్ : ఐ బొమ్మ ఫౌండ‌ర్, అడ్మిన్ ఇమ్మ‌డి ర‌వి గురించి కీల‌క స‌మాచారం వెల్ల‌డించారు సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ (CP VC Sajjanar). సోమవారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. OTT లో రిలీజ్ అయ్యే సినిమాలను కొత్త టెక్నాలజీని ఉపయోగించి స్క్రీన్ రికార్డింగ్ చేసే వాడని తెలిపారు. అదంతా మంచి క్వాలిటీతో వెబ్సైట్ లలో అప్లోడ్ చేశాడ‌ని చెప్పారు. హై-ఎండ్ టెక్నాలజీతో సీక్రెట్ కెమెరాల ద్వారా కొత్త సినిమాలను రికార్డ్ చేయ‌డం జ‌రిగింద‌ని, వాటిని ఐబొమ్మ‌లో ఉంచాడ‌ని వెల్ల‌డించారు సీపీ. ఈ మొత్తం పైరసీ రాకెట్ టెలిగ్రామ్ సామాజిక మాధ్య‌మం ద్వారా నడిచిందన్నారు. ఈ సంద‌ర్బంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు సీపీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇదిలా ఉండ‌గా ఐబొమ్మ ఓన‌ర్ ఇమ్మ‌డి ర‌వి కుమార్ ఏకంగా పోలీసుల‌కే స‌వాల్ విసిరాడు. ద‌మ్ముంటే త‌న‌ను ప‌ట్టుకోవాల‌ని అన్నాడు. త‌న స్వ‌స్థ‌లం విశాఖ‌ప‌ట్నం.

CP VC Sajjanar Shocking Comments on IBomma Founder

ఇదిలా ఉండ‌గా ఇమ్మ‌డి ర‌వి అరెస్ట్ ను స్వాగతించారు సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు. వారిలో చిరంజీవి, వెంక‌టేష్, అక్కినేని నాగార్జున‌, త‌దిత‌రులు ఉన్నారు. వీరంతా సీపీ స‌జ్జ‌నార్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇమ్మ‌డి ర‌వి ఒక్క‌డి వ‌ల్ల వంద‌ల కోట్ల న‌ష్టం సినిమా రంగానికి వాటిల్లింద‌న్నారు. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తెలంగాణ పోలీస్ శాఖ‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. ఆయ‌న ఐబొమ్మ ఓన‌ర్ అరెస్ట్ ను సినిమాలోని స‌న్నివేశంతో పోల్చారు. సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఇది పెద్ద ఉప‌శ‌మ‌నం అన్నారు న‌టుడు చిరంజీవి. గేమ్ ఛేంజర్, థండేల్, కింగ్‌డమ్, ఓజీ లాంటి అనేక సినిమాలకు ఐ బొమ్మ వ‌ల్ల భారీ న‌ష్టం వాటిల్లింద‌ని వాపోయాడు.

Also Read : Owaisi Strong Focus on Saudi Arabia : సౌదీ ఘ‌ట‌న‌పై రియాద్ రాయ‌బారితో ఓవైసీ ఆరా

Exit mobile version