CP Radhakrishnan : పుట్టపర్తి జిల్లా : సత్యసాయి ట్రస్టు అందిస్తున్న విద్యా సేవలు అద్భుతంగా ఉన్నాయని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan), ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అలాగే పట్టభద్రులైన వారికి ఉప రాష్ట్రపతి పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మాట్లాడారు. శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ సంస్థను అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. 2047 నాటికి భారత దేశం నెంబర్-1 స్థానంలో ఉంటుందన్నారు. పట్టభద్రులుగా పట్టాలు పుచ్చుకున్న విద్యార్థులు ఆ అభివృద్ధిలో భాగస్వాములు కాబోతున్నారని పేర్కొన్నారు. గత మూడు రోజుల్లో దేశంలోని అత్యున్నత స్థానంలో ఉన్న వారు సత్యసాయి జయంత్యుత్సవాల్లో పాల్గొన్నారని తెలిపారు.
CP Radhakrishnan Important Comments on Sathya Saibaba
సత్యసాయి బాబా ఎంతటి శక్తిమంతులో చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నారు రాధాకృష్ణన్. కలలో కూడా ఊహించనంతటి గొప్ప సమాజాన్ని రూపొందించ గలరనే నమ్మకం ఇక్కడున్న విద్యార్థులను చూస్తే కలుగుతోందని చెప్పారు. ఏ యూనివర్శిటీలో కన్పించినంతటి క్రమశిక్షణ, నిబద్దత అనేది శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ సంస్థలో కన్పిస్తున్నాయని ప్రశంసించారు. పట్టా పుచ్చుకున్న విద్యార్థులకు… యంగ్ మైండ్స్ ను తయారు చేసిన ఈ సంస్థకు అభినందనలు తెలియ చేస్తున్నానని అన్నారు. ఉచితంగా ఇంత పెద్ద ఎత్తున విద్యను అందివ్వడం గొప్ప విషయం అన్నారు. ఎంత మందిని గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దామనేది ముఖ్యం కాదు… ఎంత మంది మంచి పౌరులుగా తీర్చిద్దామనే కోణంలో ఈ సంస్థను నడపడం సంతోషాన్నిస్తోందని చెప్పారు రాధాకృష్ణన్.
Also Read : Punjab Singer Sidhu Death : రోడ్డు ప్రమాదంలో పంజాబ్ సింగర్ సిద్దు మృతి
