Sridevi : ప్రముఖ నటుడు, నిర్మాతగా మారిన నాని నిర్మించిన చిత్రం కోర్ట్. ఇందులో ప్రియదర్శితో పాటు శ్రీదేవి (Sridevi) అపల్లా నటించింది. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. లో బడ్జెట్ తో తీసిన ఈ మూవీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ భారీ వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ హీరోయిన్ నుంచి కీలక అప్ డేట్ వచ్చేసింది. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో నటించనున్నారు. నటుడు కేజేఆర్ తో జతకట్టనున్నారు.
Sridevi Movie Updates
తను కూడా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. తన రెండో చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. ఈ ప్రాజెక్టు కోసం అధికారికంగా పూజా కార్యక్రమాన్ని చెన్నైలో నిర్వహించారు. మార్క్ ఆంటోనీ నిర్మించిన బ్యానర్ అయిన మినీ స్టూడియో ప్రొడక్షన్ నంబర్ 15గా నిర్మిస్తోంది. ఇదిలా ఉండగా తెలుగులో ఈ సినిమాను గంగా ఎంటర్టైన్మెంట్స్ సమర్పించేందుకు ఒప్పందం చేసుకుంది.
తమిళంలో సూపర్ దర్శకుడైన ప్రశాంత్ పాండియ రాజన్ శిష్యుడైన రీగన్ స్టానిస్లాస్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుందని దర్శక, నిర్మాతలు ప్రకటించారు. కోర్ట్ చిత్రంలో వంద మార్కులు కొట్టేసిన శ్రీదేవి ఈ మూవీలో కీలకమైన హీరోయిన్ పాత్రను పోషిస్తోంది.
శ్రీదేవి, కేజేఆర్ తో పాటు అర్జున్ అశోకన్, సింగం పులి, జయప్రకాష్, హరీష్ కుమార్, పృథ్వీరాజ్, ఇంధుమతి, అశ్విన్ కె కుమార్, అభిషేక్ జోసెఫ్ జార్జ్, అజు వర్గీస్, శ్రీకాంత్ మురళి నటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం గిబ్రాన్, ఛాయాగ్రహణం పి.వి. శంకర్ అందిస్తున్నారు.
Also Read : Popular Producer Boney Kapoor : అన్షులా కపూర్ నిశ్చితార్థం బోనీ కపూర్ సంతోషం
