Hero Rajinikanth Coolie Vs War 2 ర‌జ‌నీకాంత్ కూలీ వ‌ర్సెస్ వార్ 2

ఆగ‌స్టు 14న విడుద‌ల కానున్న మూవీస్

hellotelugu-coolievswar2

Coolie : భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుద‌ల కానున్నాయి. దీంతో ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెల‌కొంది. మ‌రో వైపు సినీ వ‌ర్గాలు సైతం ఆస‌క్తితో ఎదురు చూస్తున్నాయి. ఏ సినిమాను ఎవ‌రు ఎక్కువ‌గా ఆద‌రిస్తార‌నేది. ఇక ఆ రెండు సినిమాలలో ఒక‌టి త‌మిళ సినీ రంగం నుంచి వ‌స్తుండ‌గా మ‌రొక‌టి హిందీ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి రాబోతోంది. ఈ రెండు సినిమాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ , నాగార్జున‌, ఉపేంద్ర‌, అమీర్ ఖాన్, సాబిర్ లాంటి దిగ్గ‌జ నటులు న‌టించిన చిత్రం కూలీ (Coolie) కాగా మ‌రొక‌టి టాలీవుడ్ సూప‌ర్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతికి రోష‌న్, ల‌వ్లీ బ్యూటీ కియారా అద్వానీ ముఖ్య పాత్ర‌లు పోషించిన వార్ -2 .ఈ రెండూ ఇప్పుడు ప్రీ రిలీజ్ టికెట్ల విక్ర‌యంలో, అమ్మ‌కాల‌లో టాప్ లో కొన‌సాగుతున్నాయి. సినీ రంగాల‌ను విస్తు పోయేలా చేస్తున్నాయి.

Coolie Movie Vs War 2

ఇదిలా ఉండ‌గా ప్ర‌ముఖ సినీ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో కూలీ చిత్రాన్ని తెర‌కెక్కించింది. దీనికి ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్. ఆగ‌స్టు 2వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేశారు ట్రైల‌ర్ ను. ఈ మూవీ ఆగ‌స్టు 14న రాబోతోంది. దీనికి పోటీగా వార్ -2 కూడా అదే రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఇప్ప‌టికే ఈ రెండు చిత్రాల‌కు సంబంధించి పోస్ట‌ర్స్, గ్లింప్స్, టీజ‌ర్స్ , ట్రైల‌ర్స్, సాంగ్స్ కూడా వ‌చ్చేశాయి. ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో ఉంది కూలీ లోని స్పెష‌ల్ సాంగ్. ల‌వ్ యూ మోనికా అనే పాట‌. ఇందులో పూజా హెగ్డే, సాబిర్ న‌టించారు. ఓవ‌ర్సీస్ రైట్స్ విష‌యంలో ర‌జ‌నీకాంత్ కూలీ ఏకంగా రూ. 80 కోట్ల‌కు అమ్ముడు పోయాయి. ఇక వార్ 2 కూడా యుఎస్ లో టికెట్ల అమ్మ‌కాల‌లో రికార్డ్ న‌మోదు చేసింది.

Also Read : Hero Pawan Kalyan OG Movie : షేక్ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ ఫైర్ స్టోర్మ్

Exit mobile version