Hero Pawan Kalyan OG Movie : షేక్ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ ఫైర్ స్టోర్మ్

యూట్యూబ్ లో దుమ్ము రేపుతోన్న సాంగ్

hellotelugu-ogfirestrom

OG : ద‌మ్మున్న డైరెక్ట‌ర్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం ఓజీ. ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఫ్యాన్స్ ఈ మూవీ కోసం క‌ళ్ల‌ల్లో వ‌త్తులు వేసుకుని చూస్తున్నారు. గ‌త కొంత కాలంగా రాజ‌కీయాల ప‌రంగా బిజీగా ఉండ‌డంతో త‌ను సినిమాల‌కు అంత‌గా స‌మ‌యం కేటాయించ‌లేక పోయారు. ఆ త‌ర్వాత ఇప్పుడు ప‌ద‌వి వ‌రించ‌డంతో కొంత మేర‌కు మూవీస్ పై ఫోక‌స్ పెట్టాడు. త‌ను న‌టించిన తాజా చిత్రం హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మంచి విజ‌యాన్ని అందుకుంది.

OG Movie Updates

ఇదే స‌మ‌యంలో ఇదే ఏడాది త‌ను న‌టిస్తున్న మ‌రో చిత్రం ఓజీ (OG). ఇందుకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చేసింది. త్వ‌ర‌లోనే రిలీజ్ చేస్తామ‌ని వెల్ల‌డించాడు ద‌ర్శ‌కుడు సుజిత్. మరో వైపు మాట‌ల‌తో మంట‌లు రేపే ద‌మ్మున్న ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ లో న‌టిస్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈ సినిమా షూటింగ్ రాకెట్ కంటే వేగంగా కొన‌సాగుతోంది. ఇందులో ల‌వ్లీ బ్యూటీస్ శ్రీ‌లీల‌, రాశీ ఖ‌న్నా కీ రోల్స్ పోషిస్తున్నారు ప‌వ‌న్ స‌ర‌స‌న న‌టిస్తున్నారు. తాజాగా ఫోటోస్ కూడా షేర్ చేశాడు హ‌రీష్ శంక‌ర్. మ‌రోసారి త‌న మ్యూజిక్ తో మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యాడు డీఎస్పీ.

ఇదిలా ఉండ‌గా ఓజీ మూవీకి సంబంధించి తాజాగా ఫైర్ స్టోర్మ్ పేరుతో సాంగ్ ను విడుద‌ల చేశారు. దీనికి ఎస్ఎస్ థ‌మ‌న్ అద్భుతంగా స్వ‌ర ప‌రిచాడు. ఇది యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. కేవ‌లం కొన్ని గంటల్లోపే మిలియ‌న్ వ్యూస్ తో దూసుకు పోతోంది. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ కెవ్వు కేక అంటున్నారు .

Also Read : Vijay Deverakonda – Kingdom Success : కింగ్ డ‌మ్ స‌క్సెస్ దేవ‌ర‌కొండ ఖుష్

Exit mobile version