Coolie Movie Record Break : అడ్వాన్స్ బుకింగ్ లో కూలీ రికార్డ్ బ్రేక్

లోకేష్ క‌న‌గ‌రాజ్ మ్యాజిక్ ప‌ని చేస్తోంది

Hello Telugu - Coolie Movie Record Break

Hello Telugu - Coolie Movie Record Break

Coolie : స‌న్ పిక్చ‌ర్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన చిత్రం కూలీ. దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు త‌మిళ సూప‌ర్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్. ఈ సినిమా కోసం త‌ను చాలా క‌ష్ట ప‌డ్డాడు. విచిత్రం ఏమిటంటే ఇందులో న‌టించ‌చిన వాళ్లంతా 50 ఏళ్లు దాటిన వారే కావ‌డం విశేషం. ఇప్ప‌టికే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఓవ‌ర్సీస్ రైట్స్ ఏకంగా రూ. 80 కోట్ల‌కు పైగా అమ్ముడు పోయాయి. అంతేకాదు ఫ‌స్ట్ టైమ్ ర‌జ‌నీకాంత్ కెరీర్ లో ఇంత పెద్ద స్థాయిలో ఆద‌ర‌ణ ల‌భించ‌డం. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్, టీజ‌ర్, సాంగ్స్, ట్రైల‌ర్ కు ఊహించ‌ని స్పంద‌న ల‌భించింది. ఇక కూలీ (Coolie) చిత్రాన్ని 100 దేశాల‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడు. ఇది కూడా రికార్డే.

Coolie Movie Updates

మ‌రో వైపు ఓటీటీ రైట్స్ కోసం భారీ ధ‌ర‌ను చెల్లించేందుకు ఓటీటీ సంస్థ‌లు జియో స్టార్ , అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ ప‌డుతున్నాయ‌ని, క‌నీసం రూ .100 కోట్ల‌కు పైగా అమ్ముడు పోతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇది ప‌క్క‌న పెడితే అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించ‌ని రీతిలో అమ్ముడు పోతున్నాయి. ఈ సినిమాను చూసేందుకు , టికెట్ల కోసం ఎగ బ‌డుతున్నారు. కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, తెలంగాణ‌, ఏపీల‌లో టికెట్లు తీసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కూలీ చిత్రాన్ని ఆగ‌స్టు 14న విడుద‌ల చేయ‌నున్నారు ప్ర‌పంచ వ్యాప్తంగా. ఈ సినిమా ఐదు భాష‌ల‌లో విడుద‌ల కానుంది. తొలి రోజున ఓవ‌ర్సీస్ లో రూ. 30 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఒక్క కేర‌ళ‌లో ఏకంగా 2 ల‌క్ష‌ల‌కు పైగా టికెట్లు అమ్ముడు పోయాయి. ఇక్క‌డ రూ. 3 కోట్లు వ‌చ్చాయి. త‌మిళ సినిమా చ‌రిత్ర‌లోనే అతి పెద్ద ఓపెనింగ్స్ ల‌లో ఒక‌టిగా నిలిచింది. ఇందులో రజనీకాంత్, అమీర్ ఖాన్, నాగార్జున, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్ న‌టించారు.

Also Read : Saiyaara Movie Success : రూ. 500 కోట్లు దాటేసిన సైయారా రికార్డ్

Exit mobile version