మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం : అజారుద్దీన్

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మైనార్టీ శాఖ మంత్రి

hellotelugu-MohammedAzharuddin

నిజామాబాద్ జిల్లా : రాష్ట్రంలో ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయ‌డం ప‌క్కా అని ధీమా వ్య‌క్తం చేశారు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్. ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ముగించిన సందర్భంగా అజారుద్దీన్ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ప‌ర్య‌టించారు. యెల్లారెడ్డి, జహీరాబాద్ పట్టణం, కోహిర్, నారాయణఖేడ్, బిచ్కుంద, ఆందోల్, /జోగిపేట, బాన్స్వాడ, జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ప‌ర్యటించారు. క్షేత్రస్థాయిలో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంద‌ని అన్నారు.

అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున స్పంద‌న వ‌స్తోంద‌ని చెప్పారు మంత్రి మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్. త‌మ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తోంద‌న్నారు. ఇప్ప‌టికే దేశంలో ఎక్క‌డా లేని రీతిలో సంక్షేమ ప‌థ‌కాల‌ను, కార్య‌క్ర‌మాల‌ను వ‌ర్తింప చేసింద‌ని పేర్కొన్నారు మంత్రి. సంక్షేమం, అభివృద్ధి ,సమ్మిళిత పాలన దార్శనికతపై పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. బలమైన అట్టడుగు వర్గాలు , ప్రజా మద్దతుతో, సానుకూల ఫలితాలు వ‌స్తాయ‌ని న‌మ్మ‌కం వ్య‌క్తం చేశారు అజారుద్దీన్. తెలంగాణ అంతటా కాంగ్రెస్ తరంగం వస్తుందని తాము విశ్వ‌సిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

Exit mobile version