Harish Rao : హైదరాబాద్ : తెలంగా రాష్ట్ హైకోర్టు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నాలుగు వారాల పాటు స్టే ఇవ్వడంపై స్పందించారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao). ఈ సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం గురించి ప్రస్తావించారు. ఆరు గ్యారెంటీల లాగానే బీసీ రిజర్వేషన్లు కూడా అని పేర్కొన్నారు. ఇది పక్కా తెలిసి చేసిన మోసంగా ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు, సీఎంకు బీసీ రిజర్వేషన్లపై స్టే వస్తుందని తెలుసన్నారు. ఇందులో భాగంగానే కొత్త నాటకానికి తెర లేపారంటూ ఆరోపించారు. హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. బీసీలకు న్యాయమైన వాటా దక్కాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ఇందుకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకునేంత ధైర్యం లేదన్నారు.
MLA Harish Rao Slams Congress Govt
తెలిసీ కావాలని బీసీలను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు హరీశ్ రావు. బీసీ రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ది పక్కా డ్రామా అంటూ కొట్టి పారేశారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా అని ప్రశ్నించారు. ఇక కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ కూడా బీసీల పేరుతో రాజకీయం చేస్తోందని ఆరోపించారు. కేవలం వారిని ఓటు బ్యాంకుగా చూస్తోందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఆడుతున్న నాటకమన్నారు. కానీ చివరకు బీసీలు మోసపోయామని గుర్తించారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే బీసీలకు సరైన గుర్తింపు, గౌరవం దక్కిందని చెప్పారు హరీశ్ రావు. బీసీలలో చైతన్యం పెరిగిందని, కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని వార్నింగ్ ఇచ్చారు.
Also Read : Minister Ponnam Shocking Comments : హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదు
















