కాంగ్రెస్ గూండాల దాడులు దారుణం

నిప్పులు చెరిగిన జ‌గ‌దీశ్ రెడ్డి

hellotelugu-JagadshReddy

న‌ల్ల‌గొండ జిల్లా : మాజీ మంత్రి జ‌గదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో రోజు రోజుకు దాడులు పెరిగి పోతున్నాయ‌ని ఆవేద‌న చెందారు. ప‌నిగ‌ట్టుకుని త‌మ వారిపై దాడుల‌కు తెగ‌బడుతున్నార‌ని ఆరోపించారు. త‌మ హ‌యాంలో ఈ దాడుల సంస్కృతికి చెక్ పెట్టామ‌న్నారు. కానీ రేవంత్ రెడ్డి వ‌చ్చాక తిరిగి సీమ సంస్కృతి పెరిగి పోయింద‌న్నారు. కాంగ్రెస్ గూండాలు అరాచకాలు ఎక్కువ అయ్యాయని మండిప‌డ్డారు జ‌గ‌దీశ్ రెడ్డి. కాంగ్రెస్ వచ్చాక రౌడీయిజం ఎక్కువ అయ్యిందని మేం ముందు నుండి చెప్తూనే ఉన్నామ‌న్నారు. కాంగ్రెస్ నాయకులు యథేచ్ఛగా బెదిరింపులకు పాల్పడుతూ దాడులకు దిగుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇవ్వాళ కాంగ్రెస్ రౌడీల చేతిలో మా బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య యాద‌వ్ ప్రాణాలు కోల్పోయాడ‌ని వాపోయారు జ‌గ‌దీశ్ రెడ్డి. ఇంకా ఆ గ్రామంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. పోలీసులు చోద్యం చూస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయంగా ఎదుర్కోలేక, చేతకాక దద్దమ్మల్లాగా కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారని ధ్వ‌జమెత్తారు. త‌మ హయాంలో తుంగతుర్తిలో శాంతి వెల్లి విరిసింద‌న్నారు. గ్రామాల్లో పండుగ వాతావరణం ఉండేది. ఇప్పుడు రౌడీయిజం మొదలైంద‌న్నారు.
తాము తిరగబడితే ఒక్కడు కూడా మిగలర‌ని వార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version