చెన్నై : తమిళనాడులో రాజకీయాలు రసకందాయంగా మారాయి. ఎవరూ ఊహించని రీతిలో టీవీకే పార్టీ చీఫ్ విజయ్ అద్భుత విజయాన్ని సాధించడంతో విస్తు పోయారు. 234 శాసన సభ నియోజకవర్గాలకు గాను 108 సీట్లను కైవసం చేసుకుంది టీవీకే. ఏకైక పార్టీగా కొలువు తీరింది. ఇదే సమయంలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న విజయ్ తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ రాజేంద్రకు లేఖ రాశారు విజయ్. ఇదే సమయంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇంకా 11 సీట్లు కావాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటికే ఎన్నికల ప్రచారం సందర్బంగా బీజేపీతో, డీఎంకేతో ఎలాంటి పొత్తు అనేది ఉండదని స్పష్టం చేశారు విజయ్.
తాజాగా విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రెండు వారాల సమయం ఇవ్వాలని కోరాడు గవర్నర్ కు రాసిన లేఖలో. తమ పార్టీకి, ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరాడు కాంగ్రెస్ పార్టీని. ఈ మేరకు బుధవారం కీలక సమావేశం జరిగింది. ఈ మేరకు విజయ్ సూచన మేరకు బేషరతు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది. కీలక ప్రకటన చేసింది. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే కూటమి తరఫున 28 చోట్ల పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో ఐదు స్థానాలలో గెలుపొందింది. టీవీకే మద్దతు విషయంలో డీఎంకేతో విభేదాలు నెలకొన్నాయి.


















