డీఎస్సీ-2026 సమగ్ర నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పిన స‌ర్కార్

hellotelugu-APDSC2026

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ నిరుద్యోగులకు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. దీపావ‌ళి కానుక‌గా భారీగా టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు డీఎస్సీ-2026 సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా నవంబర్ 11 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందులో 2,111 రెగ్యులర్ స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ పోస్టులతో పాటు 350 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ పోస్టులు, 150 స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 200 స్పెషల్ ఎడ్యుకేషన్ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉన్నాయి.

అదనంగా వివిధ సొసైటీల పరిధిలో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, పీఈటీ విభాగాల్లో మరో 260 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులు, జిల్లాలు, సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు, కమ్యూనల్ కేటగిరీ, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల వివరాలు, విద్యార్హతలు, వయో పరిమితి, సిలబస్, పరీక్షల షెడ్యూల్ వంటి పూర్తి వివరాలను పాఠశాల విద్యా శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు. ఇదిలా ఉండ‌గా ఏపీ స‌ర్కార్ కొలువు తీరిన త‌ర్వాత వ‌రుస‌గా డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇవ్వడం ఇది రెండ‌వ సారి కావ‌డం విశేషం.

ఇదిలా ఉండ‌గా డీఎస్సీ నోటిఫికేష‌న్ రిలీజ్ కావ‌డం ప‌ట్ల నిరుద్యోగులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ప్ర‌భుత్వానికి, ప్ర‌త్యేకించి సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Exit mobile version