అహ్మదాబాద్ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను గత కొంత కాలంగా టార్గెట్ చేస్తూ వచ్చారని అన్నాడు. అయినా ప్రతి ఒక్కరికీ తాను జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు గంభీర్. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రత్యేకించి సోషల్ మీడియా గురించి మండిపడ్డాడు. తమకు తోచిన రీతిలో కామెంట్స్ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు. తాను ఎవరి పట్ల ప్రేమ కలిగి ఉండనని, అలాగని వివక్ష ప్రదర్శించేది లేదని స్పష్టం చేశాడు. ప్రతిభ, నిబద్దత ఆధారంగానే క్రికెటర్లను ఎంపిక చేస్తామన్నాడు. ఇంకొకరు చెబితే తాను వినే రకం కాదన్నాడు. ఎవరు ఎప్పుడు ఎలా ఆడాలో, ఎలా ఆడతారో తనకు తెలుసన్నాడు.
ఆట అన్నాక గెలుపు ఓటములు సహజమన్నాడు గంభీర్. ఇదిలా ఉండగా తాను డ్రెస్సింగ్ రూమ్‌లోని వ్యక్తులకు మాత్రమే జవాబుదారీగా ఉంటానని, ఇతరులకు కాదని మరోసారి కుండ బద్దలు కొట్టాడు. కాగా భారతదేశం మూడు T20 ప్రపంచ కప్ టైటిళ్లను గెలుచుకున్న మొదటి జట్టుగా రికార్డు సృష్టించింది. నా జవాబుదారీతనం సోషల్ మీడియాలోని వ్యక్తులకు కాదన్నాడు. నా జవాబుదారీతనం ఆ మార్పు గదిలో ఉన్న 30 మందికి మాత్రమే చెందింది అని పేర్కొన్నాడు. తన పదవీకాలంలో జట్టు సంస్కృతి సంఖ్యలను వెంబడించడం కంటే వెండి వస్తువులను గెలవడం చుట్టూ నిర్మించ బడిందని గంభీర్ నొక్కి చెప్పాడు.
