చెన్నై : తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నవంబర్ 18న చెన్నైలో 10, 12 తరగతుల టాపర్లను సత్కరించనున్నారు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. విద్యా పురస్కారాల ప్రదానోత్సవంలో వివిధ నియోజకవర్గాల నుండి 10 తోపాటు 12వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించనున్నారు. చెన్నైలోని నీలంకరైలో జరగనున్న ఈ కార్యక్రమ, విద్యార్థుల విద్యా విజయాలను గుర్తించేందుకు, వారిని మరింతగా ప్రోత్సహించేందుకు ఉద్దేశించ బడింది. ఎంపిక చేసిన విద్యార్థులకు ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. నవంబర్ 4న జరిగిన మొదటి విడత కార్యక్రమంలో 30 నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులను సత్కరించగా, ఇప్పుడు రెండో విడతలో మరి కొంతమంది టాపర్లను గౌరవించనున్నారు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్.
ఇదిలా ఉండగా ఆయా పరీక్షల్లో తమ నియోజకవర్గాల పరిధిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. పాఠశాల విద్యలో 10 , 12వ తరగతి పరీక్షలు కీలక దశలు; 10వ తరగతి ఫలితాలు ఉన్నత పాఠశాల విద్యకు మార్గదర్శకంగా నిలవగా, 12వ తరగతి ఫలితాలు కళాశాల విద్యలో ప్రవేశానికి పునాదిగా ఉంటాయి. ముఖ్యమంత్రి విజయ్ నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమం విద్యార్థుల కృషిని గుర్తించడం, వారిని విద్యాపథంలో ముందుకు సాగేలా ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తోంది. ఈ కార్యక్రమం విద్యా పరమైన పురోగతిని విస్తృత సమాజం పట్ల ఆసక్తితో అనుసంధానిస్తూ, సామాజిక సంక్షేమంలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికీ లక్ష్యంగా పెట్టుకుంది.


















