ఆల‌య నిధుల‌కు బ్రేక్ వేసిన సీఎం విజ‌య్

డీఎంకే హ‌యాంలో 42 ప్రాజెక్టుల‌కు బ్రేక్

hellotelugu-CMVijay

చెన్నై : త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో కల్యాణ మండపాలు, వాణిజ్య సముదాయాల కోసం ఆలయ నిధుల వినియోగం నిలిపి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అధికారికంగా సంత‌కం కూడా చేశారు సీఎం. రూ. 115.77 కోట్ల విలువైన 29 కల్యాణ మండప ప్రాజెక్టులు, రూ. 130.08 కోట్ల విలువైన 17 వాణిజ్య సముదాయ ప్రాజెక్టులకు మంజూరు చేయ‌డాన్ని ర‌ద్దు చేశారు. ఇక‌నుంచి భక్తులకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టులకే నిధులు మ‌ళ్లిస్తామ‌ని వెల్ల‌డించారు . హిందూ మత , ధర్మాదాయ శాఖ పరిధిలోని దాదాపు రూ. 246 కోట్ల విలువైన 46 ప్రాజెక్టులకు ఇచ్చిన పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ప్రాజెక్టులు గతంలోనే ప్రకటించ బడినప్పటికీ వాటి అమలు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.

ఈ నిర్ణయానికి ప్రభుత్వం రెండు ప్రధాన కారణాలను పేర్కొంది. ప్రతిపాదిత ప్రాజెక్టులలో చాలా వరకు న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొంటున్నాయని, అలాగే ఆలయాలపై పడే ఆర్థిక భారాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నామని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆలయ నిధులను ఏ విధంగా వినియోగించాలనే విషయంలో కొత్త ప్రభుత్వం అనుసరిస్తున్న విస్తృత విధాన పరమైన పునరాలోచనకు ఈ చర్య అద్దం పడుతోందని తెలిపారు. కల్యాణ మండపాలు, వాణిజ్య సముదాయాల వంటి వాణిజ్య ప్రాజెక్టులకు కాకుండా, ఆలయ సంబంధిత ప్రాజెక్టులు లేదా కార్యకలాపాల కోసం ఈ నిధులను వినియోగించాలన్నదే ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశ్యం అని చెప్పారు.

Exit mobile version