CM Siddaramaiah Sensational Comments : నేను కోరుకుంటే త‌ప్పా న‌న్నెవ‌రూ మార్చ‌రు

క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య షాకింగ్ కామెంట్స్

Hello Telugu - CM Siddaramaiah Sensational Comments

Hello Telugu - CM Siddaramaiah Sensational Comments

CM Siddaramaiah : బెంగ‌ళూరు : క‌న్న‌డ నాట రాజ‌కీయాలు మ‌రింత వేడి పుట్టిస్తున్నాయి. వ‌చ్చే న‌వంబ‌ర్ నెల‌లో రాజ‌కీయ సంక్షోభం నెల‌కొన‌డం ఖాయ‌మ‌ని, సీఎం సిద్ద‌రామ‌య్య‌ను (CM Siddaramaiah) మార్చేస్తారంటూ బాంబు పేల్చారు క‌ర్ణాట‌క భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు విజ‌యేంద్ర‌. దీనిపై తీవ్రంగా స్పందించారు సీఎం . సోమవారం సిద్ద‌రామ‌య్య మీడియాతో మాట్లాడారు. తాను ప్ర‌స్తుతం సంతోషంగా ఉన్నాన‌ని, పాల‌నా పరంగా మంచి మార్కులే ప‌డ్డాయ‌ని చెప్పారు. తాను కోరుకుంటే త‌ప్పా న‌న్ను ఎవ‌రూ మార్చరంటూ స్ప‌ష్టం చేశారు. ఇదంతా పుకార్లు అంటూ కొట్టి పారేశారు. బీజేపీ కావాల‌ని మైండ్ గేమ్ ఆడుతోందంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్ర‌స్తుతం తాను రెండున్న‌ర ఏళ్లు సీఎంగా ప‌ని చేశాన‌ని, ఇంకా మిగిలి ఉన్న రెండున్న‌ర ఏళ్లు కూడా ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తాన‌ని చెప్పారు.

CM Siddaramaiah Key Comments

ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు సిద్ద‌రామ‌య్య‌. ఇదిలా ఉండ‌గా తొలుత ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన స‌మ‌యంలో ప‌వ‌ర్ ను సిద్ద‌రామ‌య్య రెండున్న‌ర ఏళ్లు డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ రెండున్న‌ర ఏళ్లు పంచుకుంటార‌ని ప్రచారం జ‌రిగింది. దీంతో ఈ ఒప్పందం గురించి పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్ర‌ధానంగా పాలక కాంగ్రెస్‌లో, నాయకత్వంలో మార్పు సాధ్యమవుతుందని ఊహాగానాలు కొనసాగుతున్నాయి. కునిగల్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌డి రంగనాథ్ , మాండ్య మాజీ ఎంపీ ఎల్ ఆర్ శివరామే గౌడ గత వారం శివకుమార్ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి అవుతారని పేర్కొంటూ చర్చను పునరుద్ధరించారు. నవంబర్‌లో అది జరుగుతుందని గౌడ జోడించారు. దీనిని ఖండించారు సీఎం సిద్ద‌రామ‌య్య‌.

Also Read : Minister Atchannaidu Important Update : ట‌మోటా రైతులను ఆదుకుంటాం : అచ్చెన్నాయుడు

Exit mobile version