CM Siddaramaiah Interesting Update : క‌ర్ణాట‌క‌లో మ‌త ఉద్రిక్త‌లు త‌గ్గించాం

స్ప‌ష్టం చేసిన సీఎం సిద్ద‌రామ‌య్య

Hello Telugu - CM Siddaramaiah Interesting Update

Hello Telugu - CM Siddaramaiah Interesting Update

CM Siddaramaiah : బెంగ‌ళూరు : ముఖ్య‌మంత్రి సిద్ద‌రామయ్య (CM Siddaramaiah) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దక్షిణ కన్నడ కర్ణాటకలో మత ఉద్రిక్తతలను ప్రభుత్వం పూర్తిగా త‌గ్గించ‌డం జ‌రిగింద‌న్నారు. స‌మ‌ర్థ‌వంతులైన ఉన్న‌తాధికారుల‌ను నియ‌మించామ‌ని, దీని కార‌ణంగా శాంతి భ‌ద్ర‌త‌లు పూర్తిగా మెరుగు ప‌డ్డాయ‌ని, అదుపులోకి వ‌చ్చాయ‌న్నారు. పుత్తూరులో రాయ్ ఎస్టేట్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన అశోక జన-మన 2025 కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఒకప్పుడు తరచుగా ఘర్షణలకు పేరుగాంచిన దక్షిణ కన్నడ జిల్లాలో మత విద్వేషాలను సృష్టించే ప్రయత్నాలను తమ ప్రభుత్వం అరికట్టిందని సిద్ధరామయ్య నొక్కి చెప్పారు. ఈ జిల్లా ఒకప్పుడు మతం పేరుతో జరిగిన ఘర్షణల్లో మొదటి స్థానంలో ఉండేదని అన్నారు. కానీ త‌మ స‌ర్కార్ వ‌చ్చాక దానిని పూర్తిగా అణిచి వేసింద‌ని చెప్పారు.

CM Siddaramaiah Key Comments

కులం లేదా మతం పేరుతో ఘర్షణలను రెచ్చగొట్టేవారు ఎప్పుడూ తమ సొంత పిల్లలను పంపరని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ పేదలు, అమాయకులే బాధ పడతారని అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.
పోలీసు అధికారులు తమ విధులను నిజాయితీగా నిర్వర్తిస్తే, మార్పు సాధ్యమవుతుందని స్ప‌ష్టం చేశారు సీఎం. అధికారులు, ఎన్నికైన ప్రతినిధులు సామరస్యంగా కలిసి పని చేయాల‌ని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండ‌గా సిద్ధరామయ్య ఆర్‌ఎస్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని సీరియ‌స్ కామెంట్స్ చేశారు. అన్ని వ‌ర్గాలు సంయ‌మ‌నం పాటించాల‌ని కోరారు.

Also Read : Japan New PM Sane Takaichi Sensational : జ‌పాన్ తొలి మ‌హిళా ప్ర‌ధానిగా స‌నే త‌కైచి

Exit mobile version