CM Road Show for Jubilee Hills Sensational : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో సీఎం రోడ్ షో

రెండు రోజుల పాటు రేవంత్ రెడ్డి ప్ర‌చారం

Hello Telugu - CM Road Show for Jubilee Hills Sensational

Hello Telugu - CM Road Show for Jubilee Hills Sensational

Jubilee Hills : హైద‌రాబాద్ : ఇప్పుడు అంద‌రి దృష్టి న‌వంబ‌ర్ 11న జ‌ర‌గ‌బోయే జూబ్లీ హిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నిక‌పైనే ఉంది. ఇక్క‌డ ప్ర‌ధాన పార్టీలు పోటీ ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాయి. పోటా పోటీగా ప్ర‌చారం చేప‌ట్టాయి. నువ్వా నేనా అన్న రీతిలో ప్ర‌చారం కొన‌సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర ఆరోణ‌లు ఎదుర్కొంటున్న న‌వీన్ యాద‌వ్ బ‌రిలో ఉండ‌గా దివంగ‌త బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స‌తీమ‌ణి మాగంటి సునీత పోటీలో ఉన్నారు. ఇక భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థిగా లంకాల దిలీప్ రెడ్డి ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌ధాన పోటీ మాత్రం కాంగ్రెస్ వ‌ర్సెస్ బీఆర్ఎస్ గా మారి పోయింది. ఎంఐఎం ఈసారి కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు ఇస్తోంది. ఇక పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మార‌డంతో ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ఉత్కంఠ చోటు చేసుకుంది. ఎవ‌రి అంచ‌నాలు వారికి ఉన్నాయి. ఆయా పార్టీలు త‌మ పార్టీ నుంచి అభ్య‌ర్థి త‌ర‌పున ప్ర‌చారం చేసేందుకు స్టార్ క్యాంపెయిన‌ర్ల‌ను ప్ర‌క‌టించాయి.

Jubilee Hills By Elections

తాజాగా కాంగ్రెస్ పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌మ పార్టీ త‌ర‌పున న‌వీన్ యాద‌వ్ కు మ‌ద్ద‌తుగా సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌చారం చేయ‌నున్నార‌ని వెల్ల‌డించింది. ఇందులో భాగంగా సీఎం రెండు రోజుల పాటు రోడ్ షో చేప‌డ‌తార‌ని తెలిపింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లను కవర్ చేస్తూ రెండు దశల్లో వరుస రోడ్‌షోలకు నాయకత్వం వహించ‌నున్నారు. తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ ఖ‌రారు చేసిన షెడ్యూల్ ప్ర‌కారం ముఖ్య‌మంత్రి తొలి ద‌శ‌లో అక్టోబ‌ర్ 30, 31వ తేదీల‌లో రోడ్ షోలు చేప‌డ‌తార‌ని స్ప‌ష్టం చేసింది. ఆరు డివిజన్లు యూసుఫ్‌గూడ, వెంగల్ రావు నగర్, ఎర్రగడ్డ, రహమత్‌నగర్, బోరబండ , షేక్‌పేట్ ల‌లో రోడ్ షో చేప‌డ‌తార‌ని తెలిపింది.

Also Read : K Kavitha Shocking Comments : రాజీనామా చేశా క‌ట్టుబ‌డి ఉన్నా : క‌విత

Exit mobile version