CM Revanth Reddy : హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన ప్రకటన చేశారు. తల్లిదండ్రులకు తీపి కబురు చెప్పారు. తమ బిడ్డలు ఎవరైనా ఉద్యోగులుగా ఉంటే వారికి చెందిన వేతనాల్లోంచి 10 శాతం తమ కన్నవారికి చెందేలా కొత్తగా ప్రభుత్వ పరంగా చట్టం తీసుకు వస్తామని వెల్లడించారు. విద్యార్థులు, బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పేరెంట్స్ ను నిర్లక్ష్యం చేయొద్దంటూ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజకీయ పునరావాస కేంద్రం కాదన్నారు. పదేండ్ల పాలకులు విశ్వాస ఘాతకులంటూ సంచలన ఆరోపణలు చేశారు. గ్రూప్-1 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో సీఎం ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
CM Revanth Reddy Comments
పిల్లల చదువులు, ఉద్యోగాల సాధన కోసం తల్లిదండ్రులు ఎంతో కష్ట పడతారని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి. అవసరమైన డబ్బులు ఇస్తూ, వారి భవిష్యత్ కోసం సర్వం త్యాగం చేస్తారని అన్నారు. ఉద్యోగం వచ్చాక తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. అలా చేస్తే ఉద్యోగుల జీతంలో పది శాతం కోత విధించి, పేరెంట్స్ ఖాతాల్లో వేస్తామన్నారు. దీనిపై త్వరలోనే చట్టం తప్పకుండా తీసుకు వస్తామన్నారు. శిల్ప కళా వేదికలో గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి నియామ కపత్రాలు అందచేశారు. మొత్తం 563 గ్రూప్-1 పోస్టులకు గాను 562 మంది అభ్యర్థులను టీజీపీఎస్సీ 18 శాఖలకు ఎంపిక చేసింది.
Also Read : CM Chandrababu – AP Growth : డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి
