CM Revanth Reddy Clear Instructions : ప‌థ‌కాల అమ‌లులో జాప్యం చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు 

ఉన్న‌తాధికారుల‌ను హెచ్చ‌రించిన సీఎం రేవంత్ 

Hello Telugu - CM Revanth Reddy Clear Instructions

Hello Telugu - CM Revanth Reddy Clear Instructions

CM Revanth Reddy : హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వ ప‌రంగా అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరుపై ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు. సామాన్యుడి వ‌ర‌కు చేర‌క పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఆయ‌న ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష చేప‌ట్టారు. పథకాల అమలులో జాప్యం చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు . స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు రావద్దని స్పష్టం చేశారు. పనుల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించాలని సీఎం చీఫ్ సెక్రటరీని ఆదేశించారు.

CM Revanth Reddy Key Comments

కేంద్ర గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలను పొందే ప్రక్రియను వేగవంతం చేయాల‌న్నారు. ప్రతి వారం నివేదికలు సమర్పించాలని రామ‌కృష్ణ‌రావు, ముఖ్య‌మంత్రి కార్యుల‌కు సూచించారు సీఎం. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమలులో అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, కార్యదర్శులు, విభాగాధిపతులు తమ నిర్లక్ష్య వైఖరిని వీడాల‌ని ప్ర‌త్యేకంగా స్ప‌ష్టం చేశారు. ఏ అధికారి అయినా తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం సహించదని అన్నారు రేవంత్ రెడ్డి. ప్ర‌జ‌లు త‌మ‌పై ఎంతో న‌మ్మ‌కంతో ఓట్లు వేసి గెలిపించార‌ని, అధికారాన్ని అప్ప‌గించార‌ని వారి న‌మ్మ‌కాన్ని వ‌మ్ము క‌లిగించ‌కుండా బాధ్య‌తాయుతంగా విధులు నిర్వ‌హించాల‌ని అన్నారు.
ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు తీసుకు వ‌చ్చేందుకు ఎవ‌రు ప్ర‌య‌త్నం చేసినా వారిపై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని మ‌రోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్య‌మంత్రి.

Also Read : BC JAC Bandh Sensational : పల్లె నుండి పట్నం దాకా సకలం బంద్

Exit mobile version