CM Revanth Reddy Important Meet : సీఎంను క‌లిసిన ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు

రేవంత్ రెడ్డికి ధ‌న్య‌వాదులు తెలిపిన ప్ర‌ముఖులు

Hello Telugu - CM Revanth Reddy Important Meet

Hello Telugu - CM Revanth Reddy Important Meet

CM Revanth Reddy : హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వ‌కంగా క‌లిశారు చ‌ల‌న చిత్ర రంగానికి చెందిన నిర్మాత‌లు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కులతో పాటు తెలంగాణ ఫిలిం డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ దిల్ రాజు. ముఖ్య‌మంత్రిని క‌లిసిన వారిలో నిర్మాతలు అల్లు అరవింద్, ద‌గ్గుబాటి సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని, వంశీ, బాపినీడు, డివివి దానయ్య, వంశీ, గోపి, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్, అనిల్ సుంకర,శ రత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్కేన్, రాధామోహన్, దాము ఉన్నారు.

CM Revanth Reddy, Producers Meeting

ఇక రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) భేటీ అయిన వారిలో ద‌ర్శ‌కులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల‌, వీ హ‌బ్ బాధ్యులు ఉన్నారు. ఇటీవ‌లే తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌తిష్టంభ‌న నెల‌కొంది. 18 రోజుల పాటు సినీ రంగ కార్మికులు స‌మ్మె బాట ప‌ట్టారు. త‌మ‌కు 30 శాతం వేత‌నాలు మంజూరు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఎంత‌కూ చ‌ర్చ‌లు కొలిక్కి రాక పోవ‌డంతో రంగంలోకి స్వ‌యంగా దిగారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.

భ‌విష్య‌త్తులో సినిమా రంగానికి మంచి స్కోప్ ఉంద‌ని, ఈ స‌మ‌యంలో ఆందోళ‌న విర‌మించాల‌ని , అందరికీ న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో మెగాస్టార్ చిరంజీవి సైతం ప్ర‌య‌త్నం చేసినా చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దం కాలేదు. చివ‌ర‌కు రేవంత్ రెడ్డి జోక్యంతో తెలుగు ఫిలిం ఫెడ‌రేష‌న్ నాయ‌కులు ఆందోళ‌న విర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో కార్మికులు స‌మ్మెను విర‌మించారు.

Also Read : Indian Railways Shocking : ఇకపై టికెట్ ఉంటేనే స్టేషన్ లోపలి ఎంట్రీ అంటున్న రైల్వే సంస్థ

Exit mobile version