CM Revanth Reddy : హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. ఆయన తను సీఎంగా కొలువు తీరిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లలేదు. ఏకంగా ఇవాల్టితో కలుపుకుని తను దేశ రాజధానికి 55 సార్లు వెళ్లారు. ఇది రికార్డ్ అని చెప్పక తప్పదు. ప్రధాన నేతలతో కలుసుకుంటారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం అవుతారు. ఇప్పటికే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సీరియస్ గా ఉన్నారు రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy). ఆయనను సీఎంగా ఎంపిక చేయడం పూర్తిగా పొరపాటు అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ వెబ్ న్యూస్ పోర్టల్ సౌత్ పోస్ట్ సంచలన కథనం ప్రచురించింది. ఇది దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ వచ్చేసారి ఎన్నికల్లో రాదంటూ తనే పేర్కొనడం కలకలం రేపింది.
CM Revanth Reddy Delhi Visit
ఈ తరుణంలో రేవంత్ రెడ్డిపై స్వంత పార్టీలోనే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తనకు తలనొప్పిగా మారింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక . నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. రౌడీ షీటర్ ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేయడం ఆ పార్టీకి మైనస్ గా మారింది. ఇక ఇవాళ జరిగే కీలక భేటీలో ప్రధానంగా డీసీసీ అధ్యక్షుల నియామకంపై కీలక చర్చ జరగనుంది. సమావేశానికి సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు హాజరు కానున్నారు. ఈనెలాఖరు లోపు డీసీసీ అధ్యక్షులను ప్రకటించాలని ఇప్పటికే ఏఐసీసీ స్పష్టం చేసింది. ఈ మేరకు దూకుడు పెంచారు సీఎం.
Also Read : MLA Pocharam Srinivas Reddy Challenge : తల వంచను రాజీనామా చేయను : పోచారం
