CM Revanth Reddy : సంగారెడ్డి జిల్లా – పాశమైలారం ఘటనలో ఇప్పటి వరకు 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అతి పెద్ద విషాదంగా పేర్కొన్నారు పీఎం నరేంద్ర మోదీ. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మంత్రి దామోదర రాజ నరసింహంతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులు, బాయిలర్స్ డైరెక్టర్స్ తనిఖీలు చేశారా అని ప్రశ్నించారు. ఏమైనా సమస్యలు ఉన్నట్లు గుర్తించారా , యాజమాన్యానికి సూచనలు చేశారా అని ఆరా తీశారు.
CM Revanth Reddy Shocking Comments
పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధ్యయనం చేయాలని.. ఊహాజనిత సమాధానాలు చెప్పవద్దన్నారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి హరీశ్ రావు ఘటనా స్థలాన్ని సందర్శించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడారు. సహాయక చర్యలు చేపట్టడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. దీనికి సీఎం బాధ్యత వహించాలన్నారు.
మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 1 కోటి ఇవ్వాలని , క్షతగాత్రులకు రూ. 50 లక్షలు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు బాధ్యత వహించాల్సిన కార్మిక శాఖ ఎందుకు స్పందించలేక పోయిందో చెప్పాలన్నారు. ఇలాంటి భారీ ఘటన చోసుకున్న సమయంలో రెస్పాండ్ కాక పోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో మానవత్వం ప్రదర్శించేందుకు ముందుకు రావాలని కోరారు హరీశ్ రావు.
Also Read : Popular Bonalu Festival 2025 : అసలు బోనాల పండగ విశిష్టత ఏంటో తెలుసా..
