CM Revanth Reddy Sensational : ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో సీఎం రేవంత్ రెడ్డి రికార్డ్

ఏ ముఖ్య‌మంత్రి ఇలా ప‌ర్య‌టించ లేదు

Hello Telugu - CM Revanth Reddy Sensational

Hello Telugu - CM Revanth Reddy Sensational

CM Revanth Reddy : హైద‌రాబాద్ – సీఎం ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. రెండు రోజుల ప‌ర్య‌టించ‌నున్నారు. కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమావేశం కానున్నారు. ఏఐసీసీ మాజీ చీఫ్‌ రాహుల్ గాంధీ, అధ్య‌క్షుడు మల్లికార్జున్ ఖర్గేలతో భేటీ అవుతారు. బీసీ కులగణన సర్వేపై ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు సీఎం. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy Delhi Visits

ఇదిలా ఉండ‌గా ఆయ‌న ముఖ్య‌మంత్రి అయిన నాటి నుంచి నేటి దాకా రికార్డ్ బ్రేక్ చేశారు. గ‌తంలో ఉమ్మ‌డి ఏపీలో కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన త‌ర్వాత కానీ ఇన్ని సార్లు ఢిల్లీలో ప‌ర్యటించిన దాఖ‌లాలు లేవు. ప్ర‌భుత్వ ఖ‌జానాతో రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఎలా ప‌ర్య‌టిస్తార‌ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి. ఓ వైపు ఖ‌జానాలో డబ్బులు లేవంటూనే దుబారా ఖ‌ర్చు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని నిల‌దీస్తున్నాయి. కేవ‌లం వ్యాపార ప్ర‌యోజానాలు, వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోస‌మే ఢిల్లీ బాట ప‌డుతున్నాడంటూ మండి ప‌డుతున్నాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌ప్పా ఒరిగింది ఏమీ లేదంటున్నారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసింది చాల‌క ఇప్పుడు ఎవ‌రి మెప్పు పొందేందుకు ఢిల్లీ బాట ప‌ట్టారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. త‌న ఢిల్లీ టూర్ పై శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Also Read : Minister Anam Alarming : ఆల‌యాల‌కు పూర్వ వైభవం తీసుకు వ‌స్తాం

Exit mobile version