CM Revanth Reddy : హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి ఏం జరుగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కామారెడ్డి డిక్లరేషన్ సందర్బంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం కొలువు తీరాక దానిపై చర్చలు జరిగాయి. చివరకు శాసన సభలో తీర్మానం కూడా చేశారు. చివరకు బిల్లు చట్టంగా మారేందుకు గాను రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మతో పాటు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం పొందేందుకు పంపించారు. కానీ ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు. దీనిపై పలు పార్టీలు అభ్యంతరం తెలిపాయి. మరికొందరు హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని వ్యతిరేకిస్తూ బీసీ సామాజిక వర్గానికి చెందిన బీసీ సంక్షేమ సంఘం నేతలు, మేధావులు సైతం దావాలు దాఖలు చేశారు.
CM Revanth Reddy Key Update
ఇదిలా ఉండగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై సీరియస్ కామెంట్స్ చేశారు. పిటిషన్లను డిస్మిస్ చేసింది. హైకోర్టులో పిటిషన్ పై విచారణ జరుగుతున్న సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించింది. అక్టోబర్ 8న బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణకు రానుంది. ఈ సందర్బంగా రాష్ట్ర మంతటా ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు హైకోర్టులో జరగనున్న బీసీ రిజర్వేషన్ కేసు విచారణను దృష్టిలో ఉంచుకొని, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాసంలో కీలక సమావేశం జరిగింది. విచారణ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహం, వినిపించాల్సిన వాదనలపై ఈ భేటీలో సవివరంగా చర్చించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ , పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ , మంత్రులు పొన్నం ప్రభాకర్ , ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Also Read : Jajula Srinivas Goud Fired on BJP : బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది బీజేపీనే


















