CM Revanth Interesting Comments on Modi : ముఖ్య‌మంత్రులంద‌రికీ ప్ర‌ధాని మోదీ పెద్ద‌న్న‌

ప్ర‌శంస‌లు కురిపించిన సీఎం రేవంత్ రెడ్డి

Hello Telugu - CM Revanth Interesting Comments on Modi

Hello Telugu - CM Revanth Interesting Comments on Modi

CM Revanth : హైద‌రాబాద్ : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఆయ‌న‌ను దేశంలోని ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులంద‌రికీ పెద్ద‌న్న అని అన్నారు. కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ తో స‌మావేశం అయ్యారు సీఎం. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మీరు గ‌తంలో సీఎంగా ప‌ని చేశారు. కేంద్రం స‌హ‌క‌రించ‌క పోతే రాష్ట్రాలు ఏ మాత్రం ప‌ని చేయ‌వ‌ని మీకు కూడా తెలుస‌న్నారు. మీ ద‌గ్గ‌ర పెండింగ్ లో ఉన్న మెట్రో రైల్, మూసీ డెవ‌ల‌ప్మెంట్ ఫ్రంట్, తాగునీరు, హైద‌రాబాద్ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరారు. అంతే కాకుండా హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న ప్రపంచ నగరంగా అభివృద్ధి చేయాలని కంక‌ణం క‌ట్టుకున్నామ‌న్నారు. అంత‌కు ముందు హైద‌రాబాద్ లో ప‌ట్ట‌ణాభివృద్ది మంత్రుల ప్రాంతీయ స‌మావేశంలో కేంద్ర మంత్రితో పాటు ఏపీ మంత్రి నారాయ‌ణ‌తో క‌లిసి పాల్గొన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth).

CM Revanth Reddy Praises PM Modi

ఇప్ప‌టికే రాష్ట్రానికి సంబంధించి ప‌లు ప్రాజెక్టులు ఆమోదం కోసం పెండింగ్ లో ఉన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వీటికి వెంట‌నే మంజూరు చేయాల్సిందిగా కేంద్ర మంత్రికి విన్న‌వించారు. నీటి మళ్లింపు పథకం, ప్రాంతీయ రింగ్ రోడ్ పనులకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఈవీ వాహనాలను ప్రోత్సహించడం సహా జీరో కార్బన్ ఉద్గార చర్యల గురించి ముఖ్యమంత్రి ఖట్టర్‌కు వివరించారు. రాబోయే సంవత్సరంలో హైదరాబాద్‌లో 3,000 ఎలక్ట్రిక్ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకు వ‌స్తామ‌ని చెప్పారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్, కొత్త నగరంలో ప్రపంచ పెట్టుబడులు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతిపాదిత డ్రై పోర్ట్ గురించి కూడా సమావేశంలో చర్చించారు. మేం ఇత‌ర రాష్ట్రాల‌తో పోటీ ప‌డ‌డం లేద‌ని మా పోటీ సింగ‌పూర్ , టోక్యో, న్యూయార్క్ న‌గ‌రాల‌తోనేన‌ని స్ప‌ష్టం చేశారు ఎ. రేవంత్ రెడ్డి.

Also Read : Prashant Kishor Shocking Comments : బీహార్ లో జ‌న్ సురాజ్ ఓట‌మికి నాదే బాధ్య‌త

Exit mobile version