CM Revanth Reddy Alarming : టెక్కీలు ఇంటి నుంచే ప‌ని చేయండి

భారీ వ‌ర్షాల కారణంగా సీఎం విన్న‌పం

Hello Telugu - CM Revanth Reddy Alarming

Hello Telugu - CM Revanth Reddy Alarming

CM Revanth Reddy : హైద‌రాబాద్ – బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడ‌నం కార‌ణంగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. మ‌రో ఐదు రోజుల పాటు ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగుతుంది. ఇందులో భాగంగా ప‌లు పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ఇవ్వాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యించింది. దీనిపై ఆలోచించాల‌ని విద్యా శాఖ‌ను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). హైదరాబాద్‌తో సహా తెలంగాణ అంతటా రాబోయే 72 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. దీంతో రాబోయే మూడు రోజులు ఐటీ ఉద్యోగులు ఇంటి నుండే ప‌ని చేయాల‌ని సూచించారు సీఎం.

CM Revanth Reddy Key Comments

పరిస్థితిని బట్టి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంపై నిర్ణయం తీసుకోవాలని ఆయన విద్యా శాఖను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి . ప్ర‌తి ఒక్క‌రు అందుబాటులో ఉండాల‌ని పేర్కొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ , రాచకొండ పోలీసు కమిషనర్లు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఎంఏ అండ్ యూడీ విభాగాల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సేవ‌లు అందించాల‌ని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి.

విపత్తు నిర్వహణ, అగ్నిమాపక, జీహెచ్ఎంసీ టీంస్ సంయుక్తంగా ప‌ని చేయాల‌ని పేర్కొన్నారు. ప్రజల ఫిర్యాదుల కోసం హైడ్రా టోల్-ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం. ట్రాఫిక్ నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వాతావరణ హెచ్చరికలను మీడియా ద్వారా క్రమం తప్పకుండా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. వ‌ర్షాల నేప‌త్యంలో జిల్లా కలెక్టర్లు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. పొంగి పొర్లుతున్న నదులు, వాగులు, కాలువలపై ఉన్న దిగువ స్థాయి కాజ్‌వేలు, వంతెనల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు.

Also Read : PM Modi Interesting : అదానీ సంస్థలపై ప్రధాని మోదీకి ఎనలేని ప్రేమ – ఎస్ఈసి

Exit mobile version