CM Revanth Reddy : హైదరాబాద్ – ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జీవితంలో ఊహించని రీతిలో ఉన్నత పదవిని చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నో కష్టాలు పడ్డానని, మరెన్నో అడ్డంకులను అధిగమించి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. తాను నల్లమల ప్రాంతం నుంచి వచ్చానని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ బిడ్డనని అన్నారు. ఇదే సమయంలో నారా చంద్రబాబు నాయుడును గత్యంతరం లేక వదులు కోవాల్సి వచ్చిందని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి.
CM Revanth Reddy Shocking Comments
అందరూ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళతామని, ఫ్యూచర్ ఉండదని గేలి చేశారని, కానీ సోనియా గాంధీ ఉండడంతో ఆమెను నమ్ముకుని పార్టీలోకి వచ్చానని తెలిపారు. రాహుల్ గాంధీ తనకు సోదరుడని, ప్రియాంక గాంధీ తనకు చెల్లెలు అని పార్టీ మొత్తం తన కుటుంబం కంటే ఎక్కువ అని స్పష్టం చేశారు సీఎం. తనను కావాలని కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర ఆవేదన చెందారు. అయినా తనకు ఇలాంటివి కొత్త కాదన్నారు రేవంత్ రెడ్డి. రాజకీయాలలో ఇలాంటివి సహజమేనని పేర్కొన్నారు.
కాగా ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై భగ్గుమన్నారు. 10 ఏండ్ల కేసీఆర్ పాలనపై 18 నెలల మా పాలనపై చర్చ పెట్టాలన్నారు. చెట్టు కింద పెట్టండి, పెళ్ళిలో పెట్టండి, సావు కాడ పెట్టండి, కల్లు కాంపౌండ్ కాడ మాట్లాడండి, దావత్ కాడ చర్చ జరపాలంటూ పిలుపునిచ్చారు సీఎం.
Also Read : 4013 మంది ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్
