CM Revanth Reddy : హైదరాబాద్ : ఈ దేశానికి దిశా నిర్దేశం చేసే అద్బుతమైన సాధనం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ న్యాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు, ఇంగ్లీషు భాషలో ముద్రించిన భారత రాజ్యాంగం ద్విభాషా గ్రంథాన్ని ముఖ్యమంత్రి విడుదల చేశారు. రాజ్యాంగాన్ని సమగ్రంగా తెలుగులో అందించడం అభినందనీయమని ఈ సందర్భంగా ఎ. రేవంత్ రెడ్డి అన్నారు.
CM Revanth Reddy Launch New Book
భారత రాజ్యాంగంను తెలుగు భాషలో ప్రచురించడం వల్ల భాష, సంస్కృతిని కాపాడటంతో పాటు భావి తరాలు, మేథావులు, సాహిత్య అభిమానులకు ఎంతో ఉపయుక్తంగా అందుబాటులో ఉంటుందని చెప్పారు. తెలుగులో తర్జుమా చేసి సమగ్రంగా రాజ్యాంగాన్ని తెలుగు – ఇంగ్లీషు ద్విభాషలో అందించడం వల్ల అనేక విషయాల్లో స్పష్టత ఉంటుందని అన్నారు, ముఖ్యంగా తెలుగు వారికి, సామాన్యులకు సులభంగా రాజ్యాంగం పట్ల అవగాహన పెంచు కోవడానికి వీలవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి.
ఇదే సమయంలో డాక్టర్ అంబేద్కర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎంతో కష్టపడి దీనిని రూపొందించారని, ఆయన చలవ వల్లనే ఇవాళ ప్రతి ఒక్కరు హక్కులను పొందగలుగుతున్నారని చెప్పారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలని, అవగాహన కలిగి ఉండాలని సూచించారు.. ఈ రాజ్యాంగ ప్రతులను విడుదల చేసిన సందర్భంగా న్యాయ శాఖ కార్యదర్శి బి. పాపిరెడ్డి , ఆ శాఖ ఇతర అధికారులు ఉన్నారు. దీనిని రూపొందించిన ప్రతి ఒక్కరినీ అభినందించారు రేవంత్ రెడ్డి.
Also Read : TTD Vaikunta Dwara Darshan Interesting : తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు
