CM Revanth Reddy Alarming : సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం

ఢిల్లీలో ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

Hello Telugu - CM Revanth Reddy Alarming

Hello Telugu - CM Revanth Reddy Alarming

CM Revanth Reddy : ఢిల్లీ: సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా కాంగ్రెస్ ప్రజల్లోనే ఉందన్నారు. ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంద‌న్నారు. మోడీ పీఎం అయ్యాక సామాజిక న్యాయం అన్న‌ది లేకుండా పోయింద‌న్నారు. పాకిస్తాన్ విష‌యంలో ఇందిరా గాంధీ యుద్దాన్ని ప్ర‌క‌టించి కాళీ మాతగా నిలిచార‌ని, గాంధీ త్యాగం చేసి దేశాన్ని కాపాడార‌ని, ఇందిర , రాజీవ్ ప్రాణాలు అర్పించార‌ని మ‌రి మోదీ ఏం చేశారంటూ ప్ర‌శ్నించారు.

CM Revanth Reddy Key Comments

శ‌నివారం ఢిల్లీలో జ‌రిగిన కాంగ్రెస్ పార్టీ స‌మావేశంలో ప్ర‌సంగించారు ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ లో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌న్నారు. ఇవాళ కుల గ‌ణ‌న స‌ర్వే దేశానికి రోల్ మోడ‌ల్ గా నిలిచింద‌ని చెప్పారు. బీసీల‌కు న్యాయం చేసేందుకు గాను రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్ర‌కారం 42 శాతం రిజ‌ర్వేష‌న్ బిల్లు తీసుకు వ‌చ్చామ‌ని అన్నారు. అయితే కేంద్రం దానికి ఆమోదం తెల‌ప‌కుండా రాజ‌కీయాలు చేస్తోంద‌ని ఆరోపించారు.

అంత‌కు ముందు ఎంపీ రాహుల్ గాంధీ ప్ర‌సంగించారు. 2014 నుంచి జరుగుతున్న ఎన్నికలపై మాకు అనుమానాలున్నాయని అన్నారు. ఒకే పార్టీ అన్ని స్థానాలు గెలుచుకోవడం ఏంటి… కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాక పోవడం ఏంటి..? అంటూ ప్ర‌శ్నించారు. బీజేపీకి గంపగుత్తగా ఓట్లు పడటంపై మేం దృష్టి పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు. మా దగ్గర పక్కాగా ఆధారాలున్నాయి.. ఆధారాల కోసం 6 నెలలు పని చేశాం అని చెప్పారు రాహుల్ గాంధీ. ఈసీ మాకు ఒరిజినల్‌ ఓటర్ లిస్ట్‌ ఇవ్వలేక పోయిందంటూ ఆరోపించారు.

Also Read : CM Chandrababu Sensational Comment : రైతులు ఎరువుల వాడ‌కాన్ని త‌గ్గించాలి : సీఎం

Exit mobile version