హైదరాబాద్ : ప్రపంచంలోనే అత్యున్నతమైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ. ఈనెల 13న ఆయన హైదరాబాద్ కు రానున్నారు. ఎవరూ ఊహించని రీతిలో సీఎం రేవంత్ రెడ్డి టీంతో తను మ్యాచ్ ఆడనున్నాడు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి స్వయంగా క్రీడా ప్రేమికుడు. ఇందులో భాగంగా సీఎం టీంతో మెస్సీ టీంల మధ్య కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన కూడా చేసింది. మెస్సీ టీంతో ఆడేందుకు రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ లో నిమగ్నం అయ్యారు. ఇప్పటికే సర్కార్ ప్రతిష్టాత్కంగా ఈనెల 8,9వ తేదీలలో రెండు రోజుల పాటు భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2025ను నిర్వహిస్తోంది.
ప్రపంచంలోని దిగ్గజ ప్రముఖులంతా ఇక్కడికి రానున్నారు. ఇదే సమయంలో టాప్ ఫుట్ బాల్ ప్లేయర్ గా ఇప్పటికే పేరు పొందిన మెస్సీ రానుండడంతో అందరి కళ్లు తనపై ఉన్నాయి. ఈ చారిత్రక మ్యాచ్ లో 9 నెంబరు జెర్సీ ధరించనున్నారు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ సందర్బంగా 10వ నంబర్ జెర్సీతో ఆడనున్నాడు మెస్సీ. కాగా పొలిటికల్ గ్రౌండ్ అయినా ప్లే గ్రౌండ్ అయినా రేవంత్ రెడ్డికి సాటి రారు ఎవరూ అంటూ కాంగ్రెస్ పార్టీ ఓ పోస్ట్ లో పేర్కొంది. మొత్తంగా సీఎంనా మజాకా అంటున్నారు ఆయన అభిమానులు.
