CM Revanth Reddy : హైదరాబాద్ – రాష్ట్రాలు అభివృద్ది చెందితేనే దేశం అన్ని రంగాలలో ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్. మహేంద్ర దేవ్. ఆయనకు సాదర స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.
CM Revanth Reddy Interesting Comments
తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే అంశంపై చర్చించారు. సమాఖ్య విధానం లో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రం లోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన పై దృష్టి సారించామని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రం లో పారిశ్రామిక రంగం తో పాటు సేవల రంగం అభివృద్ధి కోసం ప్రణాళిక లు రూపొందిస్తున్నామని తెలిపారు.
ఉద్యోగులకు సముచితమైన అవకాశాలు కల్పిస్తేనే రాష్టానికి కంపెనీ లు వస్తాయని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్ నిర్మిస్తామని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్ కు అనుసంధానంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ కు. అధిక వడ్డీ లకు తీసుకున్న రుణాలపైన ఆందోళన వ్యక్తం చేశారు ఎ. రేవంత్ రెడ్డి. అధిక శాతం వడ్డీల కారణంగా రాష్ట్రాభివృద్ధి కుంటు పడుతోందన్నారు. తిరిగి చెల్లింపులు కష్టం అవుతోందన్నారు.
వడ్డీలు చెల్లించడం కోసమే రాష్ట్ర ఆదాయం ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోయారు ఎ . రేవంత్ రెడ్డి.
అధిక వడ్డీ రేట్లకు తీసుకున్న రుణాలపైన వడ్డీ తగ్గించు కోవటానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
సమావేశం లో పాల్గొన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా.
Also Read : Minister Kandula Durgesh-Kota Death : విలక్షణ నటుడు కోట మరణం బాధాకరం – కందుల
