CM Chandrababu : న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీని కలుసుకున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఉన్నారు. ప్రభుత్వాధినేతగా ప్రజా సేవలో 25 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా అభినందనలు తెలియ చేశారు సీఎం. మోదీ నాయకత్వంలో భారత దేశం అన్ని రంగాలలో కీలకమైన పాత్రను పోషిస్తోందని పేర్కొన్నారు. కేంద్రం ఇటీవల తీసుకు వచ్చిన జీఎస్టీ సంస్కరణల గురించి కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా మోదీతో ప్రస్తావించారు. ఈ నిర్ణయం వల్ల కోట్లాది మందికి ఎనలేని ప్రయోజనం కలుగుతుందన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు.
CM Chandrababu Meet PM Modi inn Delhi
అందుకే తాము జీఎస్టీ కౌన్సిల్ తీర్మానాలను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో పెద్ద ఎత్తున అవగాహన, ప్రచార కార్యక్రమాలు చేపట్టామన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా ఈనెల 16న ప్రధానమంత్రి ఏపీలో పర్యటించనున్నారు. శ్రీశైలం పుణ్య క్షేత్రాన్ని దర్శించుకుంటారు. కర్నూల్ లో నిర్వహించే సభలో పాల్గొంటారు. ఇదే సమయంలో ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నంలో నాల్గవసారి సీఐఐ సదస్సు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా ప్రధాని మోదీకి వివరించారు సీఎం. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరారు.
Also Read : CM Chandrababu – AP Growth : ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే విశాఖ సదస్సు
